Sambarala Yeti Gattu: సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మెగా మేనల్లుడు..

ABN , Publish Date - Sep 09 , 2025 | 09:08 PM

మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్(Sai Durga Tej).. విరూపాక్ష లాంటి హిట్ తరువాత నటిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు (Sambarala Yeti Gattu) .

Sai Durga Tej

Sambarala Yeti Gattu: మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్(Sai Durga Tej).. విరూపాక్ష లాంటి హిట్ తరువాత నటిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు (Sambarala Yeti Gattu) . రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


అన్ని సవ్యంగా జరిగితే ఈపాటికి ఈ సినిమా రిలీజ్ కు సిద్దమయ్యేది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా దసరాకు వాయిదా పడింది. దసరా నాటికీ సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేయాలనే మేకర్స్ ఉన్నారు. అయితే మొన్నటివరకు ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఆశలు సంబరాల ఏటిగట్టు షూటింగ్ జరుపుకుంటుందా.. ? లేదా.. తేజ్ ఏం చేస్తున్నాడు అంటూ అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.


ఇక ఎట్టకేలకు తేజ్.. సంబరాల ఏటిగట్టు నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. ఈ నెల మధ్య వారం నుంచి కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నట్లు మేకర్స్ తెలుపుతూ సర్ ప్రైజింగ్ గా తేజ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో తేజ్ విశ్వరూపం చూడొచ్చు. 8 ప్యాక్ లో ఎంతో గంభీరంగా కనిపిస్తున్నాడు. ఈ లెక్కన సంబరాల ఏటిగట్టు సినిమా కోసం తేజ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ 125 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా.. మెగా మేనల్లుడుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Ameesha Patel: బద్రి భామ ఏంటీ.. ఇలా మారిపోయింది

K Ramp: కలలే కలలే సాంగ్.. భలే కలర్ ఫుల్ గా ఉందే

Updated Date - Sep 09 , 2025 | 09:08 PM