Sitara Ghattameni: నా పేరు వాడుతున్నారు.. మహేష్ కుమార్తె పోస్ట్ వైరల్
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:39 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ముద్దుల తనయ సితార(Sitara) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ వారసులు ఎవరైనా పెద్దయ్యాక సెలబ్రిటీలుగా మారతారు.
Sitara Ghattameni: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ముద్దుల తనయ సితార(Sitara) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ వారసులు ఎవరైనా పెద్దయ్యాక సెలబ్రిటీలుగా మారతారు. కానీ, సీతూ పాప మాత్రం పుట్టినప్పటి నుంచే చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. తండ్రి మహేష్ తో కలిసి ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇక పెరిగేకొద్దీ అమ్మడు కూడా తనకు సపరేట్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేసి తనకు సంబంధించిన ఫొటోలతో పాటు మహేష్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక సూపర్ స్టార్ హీరోలకు, హీరోయిన్లకు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. వారి పేర్లు మీద డబ్బులు అడగడం, వారి పేరు వాడుకొని లైక్స్ కోసం ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టడం చేస్తుంటారు. ఇక ఇప్పుడు సితార పేరు మీద కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆమె పేరును మిస్ యూజ్ చేస్తున్నారు. ఈ వార్త అటుఇటు చేరి సితార వరకు రావడంతో ఆమె స్పందించింది. తన పేరు మీద ఫేక్ అకౌంట్స్ వస్తున్నాయని, దయచేసి అలాంటి వాటి నుంచి జాగ్రత్తగా ఉండమని కోరింది.
ఫేక్ అకౌంట్స్ తో జాగ్రత్తగా ఉండండి. నా పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్, స్పామ్ అకౌంట్స్ క్రియేట్ చేయబడ్డాయని నాదృష్టికి వచ్చాయి. అందుకే నేను ఆ అకౌంట్స్ పై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ కు నేను చెప్పేది ఏంటంటే.. నాకు కేవలం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉంది. ఇదొక్కత్తె నేను వాడేది. నా నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చినా అది ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తుంది. మిగతా ఏ సోషల్ మీడియా అకౌంట్స్ లో నేను లేను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నా పేరుతో వచ్చే ఏ అకౌంట్స్ ను నమ్మకండి ' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
War-2: యన్టీఆర్ వల్లే ఆ మాత్రం కలెక్షన్స్ అని టాక్
Aishwarya Rai Bachchan: ఆత్మగౌరవాన్ని సోషల్ మీడియాలో వెతకొద్దు.. దొరకదు..