Aishwarya Rai Bachchan: ఆత్మగౌరవాన్ని సోషల్ మీడియాలో వెతకొద్దు.. దొరకదు..
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:11 PM
నటి ఐశ్వర్యారాయ్ సోషల్ మీడియా వినియోగం గురించి మాట్లాడారు. సోషల్ మీడియాపై ఆందోళనగా ఉందని చెబుతున్నారు.
నటి ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai Bachchan) సోషల్ మీడియా వినియోగం గురించి మాట్లాడారు. సోషల్ మీడియాపై ఆందోళనగా ఉందని చెబుతున్నారు. ప్రజలంతా గుర్తింపు కోసం (Social media identity) ఆరాటపడుతున్నారని అన్నారు. ప్రస్తుతం సొసైటీలో సోషల్‌మీడియా యూసేజ్ బాగా పెరిగిందనీ, వాటి ద్వారా వచ్చే లైక్స్, కామెంట్స్ జీవితాలను నిర్ణయించలేవని అన్నారు. ‘మనకంటూ ఓ విలువ ఉంటుంది. దానిని ఏదీ నిర్ణయించలేదు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్, షేర్‌లు ఇవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని బయట ప్రపంచానికి చూపవు. నిజమైన అందం మనలోనే ఉంటుంది. నా దృష్టిలో సోషల్ మీడియాకు, దానితో వచ్చే ఒత్తిడికి మధ్య తేడా లేదు. తల్లిగా నాకు ఈ విషయంలో చాలా ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలవుతున్నారు. దాన్ని దాటి ముందుకెళ్లినప్పుడే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మగౌరవం కోసం సామాజిక మాధ్యమాల్లో వెతకొద్దు.. అది కచ్చితంగా అక్కడ దొరకదు’ అని అన్నారు.
ఐశ్వర్యా కామెంట్స్‌పై ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం యువతకు కావాల్సిన మెేసజ్ ఇదేనని అభిప్రాయపడుతున్నారు. గతేడాది ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో మెరిశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించారు.
ALSO READ: Kantara Chapter1: కాంతారా.. విలన్ 'కులశేఖర' వచ్చాడు
Suhas: 'మండాడి' సుహాస్ ఫస్ట్ లుక్
Tollywood: కార్పొరేట్ ఉద్యోగులం కాదు.. కష్ట జీవులం.. కాస్త ఆలోచించండి..