Mouli Tanuj Prashanth: 'మ్యాడ్ సీక్వెల్'కు.. మౌళి నో చెప్పాడా!
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:58 PM
కొన్నిసార్లు ఛాన్సులు వదులుకుని చాలా మంది బాధపడుతుంటారు. ఆ రోజు అలా చేయకపోయి ఉంటే తమ లైఫ్ మరో విధంగా ఉండేదని ఫీలైపోతుంటారు. కానీ ఆ కుర్రాడికి మాత్రం మంచి ఛాన్సు మిస్ చేసుకోవడమే మంచిదైంది. అనుకోని అదృష్టం కలిసి వచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వారికి మౌళి తనూజ్ ప్రశాంత్ (Mouli Tanuj Prashanth) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను ఫన్నీగా, రిలేటబుల్‌గా మలిచే అతని వీడియోలు చూస్తే నవ్వు ఆపుకోలేం. ముఖ్యంగా తండ్రీకొడుకుల బంధంపై అతను చేసిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. 'నైంటీస్' (90s ) వెబ్ సీరిస్ తో పాపులర్ అయిన ఈ కుర్రాడు ఇప్పుడు మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) అనే మూవీతో సెప్టెంబర్ 5న అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. అయితే బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టబోతున్న తనూజ్... ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను రివీల్ చేశాడు.
మౌళికి గతంలోనే సూపర్ హిట్ మూవీ 'మ్యాడ్ సీక్వెల్'లో (Mad Sequel) ‘లడ్డూ’ క్యారెక్టర్ ( Laddu character) ఆఫర్ వచ్చిందట. కానీ అప్పటి రోజుల్లో తనూజ్ ఆ రోల్‌ను రిజెక్ట్ చేశాడట. అప్పట్లో తన సొంత స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ, యాక్టింగ్ ను కొన్నాళ్లు దూరం పెట్టాలని అనుకున్నాడట. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక ‘లడ్డు’ క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత మౌళి ఆ రోల్ చేసి ఉంటే, భారీ నేమ్, ఫేమ్ వచ్చి ఉండేదని అనుకున్నాడట. కానీ ఇప్పుడు తన లైఫ్ మరో టర్న్ తీసుకుంది.
'మ్యాడ్ సీక్వెల్' లో నటించకపోవడమే మంచిదైంది. ‘లడ్డు’ రోల్ రిజెక్ట్ చేయడం వల్లే 'లిటిల్ హార్ట్స్'లో మెయిన్ లీడ్‌గా నటించే అవకాశం దక్కింది. ఒకవేళ లడ్డూ క్యారెక్టర్‌తో మౌళి హిట్టయితే, ఫిల్మ్‌మేకర్స్ అతన్ని అలాంటి క్యారెక్టర్స్‌కే టైప్‌కాస్ట్ చేసేవారు. కానీ, తనూజ్ స్మార్ట్‌గా స్టీరియోటైప్ కాకుండా, మంచి రోల్స్ కోసం వెయిట్ చేశాడు. మొత్తానికి నో చెప్పడం కూడా కలిసొచ్చిందన్నమాట
Read Also: Dhanush: 'కాంతార', 'ఓజీ' తో ధనుష్ రిస్క్ చేస్తున్నాడా...
Read Also: Param Sundari controversy: మలయాళ అమ్మాయిలు దొరకలేదా.. వివాదంపై సింగర్ పవిత్ర క్లారిటీ..