NTR: కాంతార కోసం బయటకు వస్తున్న ఎన్టీఆర్..

ABN , Publish Date - Sep 26 , 2025 | 08:52 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

NTR

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రిషబ్ కు ఎన్టీఆర్ కు అవినాభావ సంబంధం ఉన్న విషయం తెల్సిందే. వారిద్దరూ ఎప్పటి నుంచొ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు.


ఇక డ్రాగన్ కోసం రిషబ్ క్యామియో చేయడానికి ఒప్పుకోవడంతో.. ఎన్టీఆర్ సైతం రిషబ్ కు తనవంతు సాయం చేయడానికి సిద్దమయ్యాడు. రిషబ్ శెట్టి నటిస్తున్న చిత్రం కాంతార చాఫ్టర్ 1. ఆయనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ నే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కానుంది.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 28 న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో కాంతార ఛాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ఎన్టీఆర్ బయటకు వచ్చింది లేదు. ఇప్పుడు కాంతార కోసం ఎన్టీఆర్ బయటకు వస్తున్నాడు. మరి ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో చూడాలి.

Thamma Trailer: భయపెడుతున్న రష్మిక థామా ట్రైలర్..

Allu Sirish: పెళ్లి పీటలు ఎక్కనున్న అల్లు హీరో

Updated Date - Sep 26 , 2025 | 08:53 PM