Thamma Trailer: భయపెడుతున్న రష్మిక థామా ట్రైలర్..
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:55 PM
వరుస విజయాలతో ఇండస్ట్రీని ఏలుతున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తున్న చిత్రాల్లో థామా (Thamma) ఒకటి.
Thamma Trailer: వరుస విజయాలతో ఇండస్ట్రీని ఏలుతున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తున్న చిత్రాల్లో థామా (Thamma) ఒకటి. ఛావా లాంటి హిట్ తరువాత బాలీవుడ్ లో రష్మిక నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా థామా. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తుండగా దినేష్ విజన్ మరియు అమర్ కౌశిక్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా థామా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. భేదియా, ముంజ్య లాంటి కామెడీ హర్రర్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న మాడాక్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఆ రెండు సినిమాలను కలుపుతూ థామా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కొన్ని వందల ఏళ్ళ క్రితం యక్షసన్ అనే ఒక వాంపైర్ ఉండేవాడు. అతనిని ఒక దగ్గర బంధించడం చూపించారు. ఇక యక్షసన్.. హీరో కలిసిన దగ్గర నుంచి అతడికి కూడా వాంపైర్ లక్షణాలు వస్తాయి. కోర పళ్లు, కొన్ని శక్తులు రావడంతో పాటు తడికి తెలియకుండానే కొన్ని దుష్ట శక్తులతో పోరాటం చేయాల్సి వస్తుంది. అసలు హీరోకు యక్షసన్ కి సంబంధం ఏంటి.. ? హీరో కూడా వాంపైర్ గా మారిపోయాడా.. ? అతడిని వెంటాడుతున్న శక్తులు ఏంటి.. ? ఇక హీరోకు సపోర్ట్ గా నిలబడిన హీరోయిన్ ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
థామా ఏమి కొత్త కథలా అనిపించడం లేదు. కానీ, వాంపైర్ స్టోరీ కావడంతో ఆసక్తిని కలిగిస్తుంది. థామాగా నవాజుద్దీన్ సిద్దిఖీ నటించగా అలోక్ గా ఆయుష్మాన్ నటించాడు. అలోక్ గర్ల్ ఫ్రెండ్ గా రష్మిక కనిపించింది. ఇక బాలీవుడ్ సినిమా అంటే పెదవి ముద్దులు లేకుండా ఎలా.. ఇందులో కూడా రష్మిక - ఆయుష్మాన్ మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇది కూడా ఒక కామెడీ హర్రర్ సినిమా. అలోక్ తండ్రిగా పరేష్ రావల్ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక పోతే ఈ చిత్రం అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రష్మిక మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
Allu Sirish: పెళ్లి పీటలు ఎక్కనున్న అల్లు హీరో
OG Mania: 'ఓజీ' థీమ్ హుడీతో మెస్మరైజ్