Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ మరో రికార్డ్
ABN, Publish Date - Oct 04 , 2025 | 09:44 AM
కాత్యాయిని భోం చేశావా? ఓరేయ్ అఖిల్ ఇదేమీ పాటరా? ఈ పాటను మరచిపోవడం అంత ఈజీ కాదు. థియేటర్లలో మోత మోగించిన పాట ఇది.
కాత్యాయిని భోం చేశావా?
ఓరేయ్ అఖిల్ ఇదేమీ పాటరా?
ఈ పాటను మరచిపోవడం అంత ఈజీ కాదు. థియేటర్లలో మోత మోగించిన పాట ఇది.. ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన పాట ఇది. ‘లిటిల్ హార్ట్స్’లోని ప్రియురాలి కోసం ప్రియుడు పాడిన ఈ పాట ట్రెండ్ అయింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రమిది. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చిన్న సినిమాల్లో భారీ విజయం సాధించింది.
ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో సాయి మార్తాండ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘90స్’ ఫేమ్ ఆదిత్య హాసన్ నిర్మించారు. కాలేజ్ రోజుల్ని గుర్తు చేస్తూ థియేటర్లలో యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈటీవీ విన్‌లో 100మిలియన్ స్ర్టీమింగ్ మినిట్స్ దాటి అత్యధికంగా వీక్షించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని చెబుతూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు మేకర్స్.
ALSO READ: Raviteja: రవితేజ అనార్కలి.. పేరు మారిందా?
Vijay Rashmika Engagement: విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి!
Ajith Kumar: భారతీయ సినిమాను ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చు..
Hrithik Roshan: చిత్రహింసలు పడుతూ ఉండాల్సినంత అవసరం లేదు