Hrithik Roshan: చిత్రహింసలు పడుతూ ఉండాల్సినంత అవసరం లేదు
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:33 AM
‘వార్-2’ (War 2) చిత్రం ఫలితంపై హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) స్పందించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఆయన నటించిన ‘వార్-2’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది.
‘వార్-2’ (War 2) చిత్రం ఫలితంపై హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) స్పందించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఆయన నటించిన ‘వార్-2’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత ఈ సినిమాపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హృతిక్ పోస్ట్ (hrithik post viral) చేశారు.
‘ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఏ సినిమాకు పని చేసినా మంచి విజయం సాధించాలనే కష్టపడి పని చేస్తాం. వార్-2కు మేమంతా అలాగే పని చేశాం. కబీర్ క్యారెక్టర్‌ను ఎంతో సరదాగా చేశా. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి నాకు సులభం అనిపించింది. నటుడిగా నా సలహా ఒకటే.. సెట్‌లోకి వెళ్లాక దేన్నైనా తేలిగ్గా తీసుకోండి. చేసే పని విషయంలో పూర్తి బాధ్యతగా వ్యవహరించండి. 100 శాతం ఎఫర్ట్ పెట్టండి. మీ పని మీరు పూర్తి చేసే ఇంటికి రండి. వార్-2 విషయంలోనూ నేను అదే చేశాను. దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాను, నన్ను చాలా బాగా చూసుకున్నారు.
షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన ఎనర్జీ చూసి మాలో ఉత్సాహం రెట్టింపు అయ్యేది. ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఎప్పుడూ నా మనసులో రెండు ఆలోచనలు వస్తుండేవి.. ‘ఇది చాలా సులభం నువ్వు చేయగలవు, ప్రతి సినిమాకూ గాయాలయ్యేలా చిత్రహింసలు పడుతూ ఉండాల్సినంత అవసరం లేదు. రిలాక్స్‌గా పని చెయ్’ అని నా మనసు చెబుతుండేది. అందుకే ఈ సినిమాను ఎంతో సరదాగా పూర్తి చేశాను’ అని హృతిక్ రోషన్ తన పోస్టులో రాశారు.
2019లో విడుదలైన ‘వార్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్టీమింగ్ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ వర్షన్స్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్ లో ఈ సినిమాను చూడని వారికి ఇదో మంచి అవకాశం.
ALSO READ: Raviteja: రవితేజ అనార్కలి.. పేరు మారిందా?
Vijay Rashmika Engagement: విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి!
Ajith Kumar: భారతీయ సినిమాను ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చు..
Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ మరో రికార్డ్