Mega158: చిరుతో తమిళ్ హీరో స్క్రీన్ షేరింగ్.. మల్టీస్టారర్ అని చెప్పలేదే బాబీ
ABN, Publish Date - Oct 26 , 2025 | 06:46 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభర(Vishwambhara) షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కు సిద్దమయ్యింది.
Mega158: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభర(Vishwambhara) షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కు సిద్దమయ్యింది. మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) సినిమా సెట్స్ మీద ఉంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ రెండు సినిమాల తరువాత చిరు నటిస్తున్న చిత్రం మెగా 158. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే చిరు - బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తరువాత బాబీ.. డాకు మహారాజ్ తో మరో హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ సమయంలోనే చిరు కోసం మరో మంచి కథను రెడీ చేసి.. ఆయనకు చెప్పడం, వెంటనే ఆయన ఒప్పుకోవడం జరిగిందట.
బాబీ కొల్లి - చిరు సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. మెగా 158 లో తమిళ్ కుర్ర హీరో కార్తీ కీలక పాత్రలో నటిస్తున్నాడట. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని సమాచారం. కార్తీ కూడా చిరుతో స్క్రీన్ షేర్ అంటే వెంటనే ఓకే చెప్పాడట.
కార్తీకి సోలో హీరోగానే చేయాలి అనే రూల్ లేదు. ఇప్పటికే నాగార్జునతో ఊపిరి లాంటి మల్టీస్టారర్ చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు చిరుతో చేయడానికి సిద్దమయ్యాడు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఇదే కానీ నిజమైతే ఈ కాంబోపై అభిమానులు అంచనాలను పెట్టుకుంటున్నారు. ఇక బాబీకి ఇలా చిరు సినిమాల్లో మరో హీరోను పెట్టడం కొత్తేమి కాదు. వాల్తేరు వీరయ్యలో రవితేజ నటించాడు. కానీ ఎక్కువసేపు కనిపించలేదు. ఈసారి అలా కాదట. కార్తీ సినిమా మొత్తం కనిపిస్తాడని టాక్. ఈ వార్త తెలియడంతో అభిమానులు.. చిరు సినిమా అన్నారు.. మల్టీస్టారర్ అని చెప్పలేదేంటి బాబీ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Aaryan Song: మరో మంచి మెలోడీతో వచ్చిన ఆర్యన్..
Mamitha Baiju: డ్యూడ్ కి రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్.. మమితా ఏం అన్నదంటే