Aaryan Song: మరో మంచి మెలోడీతో వచ్చిన ఆర్యన్..

ABN , Publish Date - Oct 26 , 2025 | 06:04 PM

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా ప్రవీణ్ కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్యన్ (Aaryan). ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, మానస చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. సెల్వ రాఘవన్ విలన్ గా కనిపిస్తున్నాడు.

Aaryan

Aaryan Song: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా ప్రవీణ్ కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్యన్ (Aaryan). ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, మానస చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. సెల్వ రాఘవన్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన ట్రైలర్, ఐయామ్ ది గాయ్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 31 న ఆర్యన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా సినిమాలోని సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఆర్యన్ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు.

పరిచయమే.. పదనిసలా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లిటికల్ వీడియో కాకుండా డైరెక్ట్ వీడియో సాంగ్ నే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు. మొదటి సాంగ్ శ్రద్దా శ్రీనాథ్ ప్రేమలో విష్ణు విశాల్ మునిగిపోయినట్లు చూపించారు. ఇప్పుడు ఈ పరిచయమే సాంగ్ లో విష్ణు విశాల్ - మానస ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం లాంటి విజువల్స్ చూపించారు. సాంగ్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. పోలీస్ గా విష్ణు విశాల్ కనిపించగా.. క్లూస్ టీమ్ ఆఫీసర్ గా మానస కనిపించింది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో విష్ణు విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Raviteja: రవితేజతో.. 'విశ్వంభర వశిష్ట'! ఆల్మోస్ట్‌ ఫైనల్‌

Nandamuri Balakrishna: నారా రోహిత్ పెళ్లి వేడుకల్లో బాలయ్య సందడి

Updated Date - Oct 26 , 2025 | 06:04 PM