Mamitha Baiju: డ్యూడ్ కి రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్.. మమితా ఏం అన్నదంటే

ABN , Publish Date - Oct 26 , 2025 | 03:50 PM

ఇండస్ట్రీలో హీరో అయినా హీరోయిన్ అయినా ఒక్క హిట్ అందుకున్నారు అంటే కచ్చితంగా నెక్స్ట్ సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుతారు.

Mamitha Baiju

Mamitha Baiju: ఇండస్ట్రీలో హీరో అయినా హీరోయిన్ అయినా ఒక్క హిట్ అందుకున్నారు అంటే కచ్చితంగా నెక్స్ట్ సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుతారు. ఎందుకంటె మార్కెట్ ను పెంచుకుంటేనే వారు కూడా మరింత ముందుకు వెళ్లగలుగుతారు కాబట్టి. అయితే ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకు రెమ్యూనరేషన్ పెంచితే అది నిర్మాతలకు ఇబ్బంది లేకుండా ఉండాలి. కానీ, కొంతమంది మాత్రం కోట్లు.. కోట్లు పెంచేస్తూ ఉంటారు.

తాజాగా కోలీవుడ్ బ్యూటీ మమితా బైజు.. డ్యూడ్ సినిమాకు ఏకంగా రూ. 15 కోట్లు అందుకుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన మమితా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే ప్రదీప్ రంగనాథన్ సరసన డ్యూడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో కూడా చేరింది.

ఇక ప్రేమలు నుంచి డ్యూడ్ కి వచ్చేసరికి మమితా బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకుంటున్నట్లు రూ. 15 కోట్లు అందుకుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై మమితా స్పందించింది. డ్యూడ్ సినిమాను తాను తీసుకున్న పారితోషికం వేరు అని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. తనను అంత పెద్ద హీరోయిన్ అని అనుకుంటున్నారా.. లేక ఎక్కువ డిమాండ్ చేసి తీసుకొనే హీరోయిన్ లా కనిపిస్తున్నానా అని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఇక దీంతో ఈ పారితోషికం రూమర్స్ కు చెక్ పడింది. ఇకపోతే ప్రస్తుతం అమ్మడు జన నాయగన్ సినిమాలో నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

June Lockhart: హాలీవుడ్‌ లెజెండరీ నటి జూన్‌ లాక్‌హార్ట్‌ ఇకలేరు..

Bison Making: 'బైసన్' కోసం ధృవ్ ఎంతగా కష్టపడ్డాడో చూడండి 

Updated Date - Oct 26 , 2025 | 03:50 PM