Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం బుడ్డోడి పేరేంటో తెలుసా..
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:40 AM
కథానాయకుడు కిరణ్ అబ్బవరం, రహస్యా గోరక్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
కథానాయకుడు కిరణ్ అబ్బవరం, రహస్యా గోరక్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ బిడ్డకు శ్రీవారి సన్నిధిలో నామకరణం చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు కిరణ్ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం ఇచ్చారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘స్వామి సన్నిధిలో బాబుకి నామకరణం చేయడానికి వచ్చాం. కనులారా స్వామిని దర్శించుకున్నాం. బాబుకి హను అబ్బవరం అని నామకరణం చేశాం. స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.
సినిమాల గురించి చెబుతూ.. ప్రస్తుతం కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు షూటింగ్ జరుగుతోంది. ఈ నెలలో మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది’ అని తెలిపారు. రహస్యా గోరక్, కిరణ్ అబ్బవరం కలిసి రాజావారు రాణివారు చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు.
ALSO READ: Viral Vayyari: షేక్ చేసిన వయ్యారి.. ఫుల్ వీడియో చూసేయండి..
Tollywood: సోమవారం నుండి.. సినిమా షూటింగ్స్ బంద్
Siri And Priyanka Jain: ఛీఛీ.. మీకసలు సిగ్గుందా.. పెళ్లి కాకుండా ఈ పూజలు ఏంటి
Dhanush: ఆత్మను చంపేశారు.. ఏఐ క్లైమాక్స్ పై మండిపడ్డ ధనుష్