Siri And Priyanka Jain: ఛీఛీ.. మీకసలు సిగ్గుందా.. పెళ్లి కాకుండా ఈ పూజలు ఏంటి
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:11 PM
ఈ జనరేషన్ లో తెలుగు సంప్రదాయాలు అంటే ఆటలుగా మారిపోయాయి. ఏది చేసినా ఎవరూ ఏమనరులే అనే దైర్యంతో ఏది పడితే అది చేస్తున్నారు.
Siri And Priyanka Jain: ఈ జనరేషన్ లో తెలుగు సంప్రదాయాలు అంటే ఆటలుగా మారిపోయాయి. ఏది చేసినా ఎవరూ ఏమనరులే అనే దైర్యంతో ఏది పడితే అది చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక లైక్స్ కోసం, పేరు కోసం హిందూ ధర్మాలను తమకు నచ్చినట్లు మార్చుకుంటున్నారు. తాజాగా సీరియల్ నటీమణులు ఇద్దరు.. పెళ్లి కాకుండానే వరలక్ష్మీ వ్రతం చేసి ట్రోల్ అవుతున్నారు. వారెవరో కాదు.. బిగ్ బాస్ ఫేమ్ సిరి(Siri), ప్రియాంక జైన్(Priyanka Jain).
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వెళ్లి తమకంటూ ఒక పేరు తెచ్చుకున్న నటీమణులు సిరి హన్మంతు, ప్రియాంక జైన్. ఇక వీరిని పెళ్లి చేసుకోబోయే వారిగా శ్రీహన్, శివ కూడా అభిమానులకు సుపరిచితులే. వారు కూడా నటులే కావడంతో.. ఈ జంటలు ఎక్కడ కనిపించినా సందడే సందడిఅని చెప్పొచ్చు. ఇక ప్రియాంక జైన్ - శివ మధ్య జరిగే ప్రతి విషయం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూనే వస్తున్నారు. పెళ్లి కాకుండానే కలిసి ఉంటూ భార్యాభర్తలుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ప్రియాంక - శివ మాత్రమే కాదు. సిరి - శ్రీహన్ కూడా పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు. తాజాగా ఈ రెండు జంటలు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పూజను వారి ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. పెళ్లి కాకుండా ఇలాంటి పూజలు చేయకూడదు అని.. ఒకవేళ పెళ్లి చేసుకొని ఇలాంటివి చేస్తే బావుంటుందని కొందరు.. ఛీఛీ.. మీకసలు సిగ్గుందా.. పెళ్లి కాకుండా ఈ పూజలు ఏంటి.. ఇలా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Tollywood: సోమవారం నుండి షూటింగ్ బంద్...
Su From So: తెలుగులోనూ వస్తోన్న.. రీసెంట్ కన్నడ బ్లాక్ బస్టర్