సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

K-RAMP Teaser: ఆ కిస్ లు ఏంటి.. బూతులేంటి.. దేవుడా కిరణ్ సినిమానేనా ఇది

ABN, Publish Date - Sep 19 , 2025 | 04:46 PM

రాజావారు రాణిగారు అనే సినిమాతో హీరోగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).

K- Ramp

K-RAMP Teaser: రాజావారు రాణిగారు అనే సినిమాతో హీరోగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). మొదటి సినిమాతోనే డీసెంట్ హిట్ ను అందుకొని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత కిరణ్ చేసిన సినిమాల్లో హిట్లు కన్నా ప్లాపులే ఎక్కువ ఉన్నాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో ఎక్కడా.. బూతులు కానీ, ముద్దు సీన్ లు కానీ ఎప్పుడు కిరణ్ వాడలేదు. ఇక వరుస సినిమాలు చేస్తున్న కిరణ్ ను చూసి.. సినిమాలు ఎప్పుడు ఆపేస్తాడురా బాబు అని తలలు కొట్టుకున్నారు. దీంతో ఒక ఏడాది గ్యాప్ తీసుకొని కథను, లుక్ ని మార్చి క లాంటి ఒక మంచి కథతో వచ్చి సక్సెస్ అయ్యాడు.


నిజం చెప్పాలంటే మంచి కథతో వస్తే ప్రేక్షకులు ఎవరినైనా సక్సెస్ చేస్తారు అని అప్పటికే కిరణ్ కు అర్ధమవ్వాలి. కానీ, ఆ సినిమా తరువాత కూడా కిరణ్ పాత పద్దతిని మార్చలేదు. అవే రొట్ట కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంతేనా ఈసారి లిప్ కిస్ లు, బూతులు కూడా తగిలించి మరీ తీసుకొస్తున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రాల్లో ఒకటి కె ర్యాంప్. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తీ తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక ఫస్ట్ గ్లింప్స్ లో బూతు పురాణం చూపించడంతో అప్పుడే కిరణ్ పై చాలామంది అక్షింతలు కూడా వేశారు. అయినా కిరణ్ మారలేదు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో బూతులు, లిప్ కిస్ లతో నింపేశారు. అసలు సడెన్ గా చూస్తే ఇది కిరణ్ అబ్బవరం సినిమానా అని షాక్ అవుతారు అంటే అతిశయోక్తి లేదు. టీజర్ లో కథ ఏమి చూపించలేదు. హీరో ఒక ఆవారా.. కాలేజ్ లో చదువు ఎగ్గొట్టి.. హాస్టల్ లో ఫ్రెండ్స్ తాగి తందానాలు ఆడుతూ ఉంటాడు. తండ్రి తన మాట వినడం లేదని వదిలేస్తాడు. అలాంటి హీరో.. కాలేజ్ లో హీరోయిన్ ప్రేమలో పడతాడు. హీరోయిన్ ఒక సైకో. హీరో ఏ పని చేసినా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా వీరిద్దరి మధ్య అప్పుడప్పుడు రొమాన్స్, మధ్యలో కోపాలు, చిరాకులు.. హీరో అల్లరి చేష్టలు తప్ప సినిమా కథ ఏంటి అనేది చూపించలేదు. ఇక ఆ బూతులు అయితే నివ్వెర బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో వచ్చినట్లు ఎక్కడా బీప్ లు కానీ, వేరే అక్షరం మార్చి కానీ అనకుండా డైరెక్ట్ గా మాట్లాడేయడం మరీ ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎబ్బెట్టుగా ఉంది అని చెప్పొచ్చు.


ఇక ఈ టీజర్ చూసాక కిరణ్ ను విమర్శిస్తారేమో అనుకోని తన మీద తానే పంచ్ వేసుకున్నట్లు బిల్డప్ లు ఎక్కువయ్యాయి.. తగ్గించుకోమని చెప్పారు అని ఒక డైలాగ్ యాడ్ చేశాడు. అసలు ఇలాంటి క్యారెక్టర్ కిరణ్ కు అసలు నప్పలేదు అని కొందరు పెదవి విరుస్తున్నారు. బూతులు, కిస్ లు పెట్టి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలని కిరణ్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కానీ, ఈసారి కూడా ఈ కుర్ర హీరో చేతులు కాల్చుకుంటాడని అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే.. అది దాచి పెట్టి బయటకు ఇలాంటివి చూపిస్తే కచ్చితంగా వచ్చే ప్రేక్షకులు కూడా థియేటర్ కు రారు అని అంటున్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రైలర్ లో ఇలాంటివి లేకుండా చూస్తారేమో చూడాలి.

Ameesha Patel: 50 ఏళ్లు వచ్చినా అందుకే పెళ్లి చేసుకోలేదు..

Bhadrakali Review: విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్ ‘భద్రకాళి’ ఎలా ఉందంటే..

Updated Date - Sep 19 , 2025 | 04:46 PM