Ameesha Patel: 50 ఏళ్లు వచ్చినా అందుకే పెళ్లి చేసుకోలేదు..

ABN , Publish Date - Sep 19 , 2025 | 03:32 PM

బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel) ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. గదర్ 2 తో రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్న అమీషా..

Ameesha Patel

Ameesha Patel: బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel) ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. గదర్ 2 తో రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్న అమీషా.. ఆ తరువాత తౌబా తేరా తల్వా అనే సినిమాలో కనిపించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత నుంచి అమీషా ఒక్క ప్రాజెక్ట్ ను కూడా ఓకే చేయలేదు. అమ్మడి సినిమాల గురించి పక్కన పెడితే.. 50 ఏళ్లు వచ్చినా అమీషా పెళ్లి చేసుకోలేదు.


ఇప్పటివరకు ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు. ఎట్టకేలకు అమీషా ఆ సీక్రెట్ ను రివిల చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమీషా 50 ఏళ్లు వచ్చినా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో వివరించింది. చాలామంది హీరోయిన్స్.. పెళ్లి చేసుకొని కెరీర్ ను వదిలేస్తూ ఉంటారు. కానీ, అమీషా మాత్రం కెరీర్ కోసం ప్రేమనే వదిలేసాను అని చెప్పుకొచ్చింది. తానేమీ పెళ్లికి వ్యతిరేకిని కాను కానీ, తన ఇష్టాలను గౌరవించేవాడు వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.


' ఇప్పటికీ నాకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. నాకన్నా వయస్సులో సగం ఉన్నవారు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానికి రెడీ అంటున్నారు. కానీ, వారందరూ పెళ్లి తరువాత సినిమాలు వద్దు అని చెప్తున్నారు. అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు. 50 ఏళ్లుగా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే. మనల్ని ప్రేమించేవారు మనం ముందుకు వెళ్ళాలి అని కోరుకోవాలి. అలాంటి వారు నా జీవితంలో ఇంకా రాలేదు. గతంలో నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. అతను కూడా పెళ్లి తరువాత సినిమాలు వద్దు అన్నాడు. కేరర్ కోసం నేను ఎన్నో వదులుకున్నాను. ప్రేమ కన్నా కెరీర్ గొప్పదనిపించింది. అందుకే ప్రేమనే వదిలేశాను. నాకు తగినవాడు వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను' అంటూ అమీషా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Mahavathar Narasimha: ఫ‌ర్‌ఫెక్ట్‌ టైంలో.. ఓటీటీలో దిగింది! ఇక ఇండ్ల‌న్నీ మ‌టాషే

Annamayya Movie: అప్పుడూ ఇప్పుడూ ఆయనే సీఎం...

Updated Date - Sep 19 , 2025 | 03:32 PM