సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni Nagarjuna: మలయాళ ముద్దుగుమ్మలతో మన్మథుడు..

ABN, Publish Date - Aug 25 , 2025 | 09:15 PM

నిజంగా మన్మథుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ, ఉంటే మాత్రం అచ్చం అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)లానే ఉంటాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: నిజంగా మన్మథుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ, ఉంటే మాత్రం అచ్చం అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)లానే ఉంటాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. వయస్సు పెరిగేకొద్ది ఎవరికైనా అందం తరుగుతుంది. యవ్వనం తగ్గుతుంది. కానీ, నాగ్ విషయంలో ఇదంతా రివర్స్ లో జరుగుతుంది. వయస్సు పెరిగేకొద్ది నాగ్ మరింత యవ్వనంగా తయారవుతున్నాడు. అసలు నాగ్ ను చూసిన వారెవ్వరైనా ఆయన వయస్సు 66 అంటే నమ్ముతారా.. ? నిజమే ప్రస్తుతం నాగ్ 66 వ పడిలో ఉన్నాడు. అయినా వన్నె తగ్గని అందంతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.


తాజాగా అక్కినేని నాగార్జున మలయాళ ముద్దుగుమ్మలతో కలిసి కనిపించాడు. మలయాళ కుర్ర హీరోయిన్స్ అయిన మమితా బైజు, ప్రియా ప్రకాష్ వారియర్, అనస్వర రాజన్, దీప్తి సతీలతో నాగ్ ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. నలుగురు హీరోయిన్స్ మధ్య కింగ్.. ఇంకా నవ మన్మథుడిలానే కనిపిస్తున్నాడు. కింగ్ సినిమాలో నువ్వు రెడీ నేను రెడీ సాంగ్ లో టాలీవుడ్ హీరోయిన్స్ అందరూ వచ్చి కింగ్ తో డ్యాన్స్ వేసి వెళ్తారు. ఇప్పుడు ఆ సాంగ్ ను నాగ్ రీక్రియేట్ చేశాడు. అయితే ఇది ఎక్కడ జరిగింది. ఏ ఈవెంట్ లో వీరు కలిశారు అనే డీటైల్స్ ఇంకా తెలియరాలేదు. ఇక ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది. నాగార్జున ఎక్కడైనా మన్మథుడే అని కొందరు. జెన్ జెడ్ హీరోయిన్స్ తో కింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇక నాగార్జున కెరీర్ గురించి చెప్పాలంటే.. హీరో నుంచి టర్న్ తీసుకున్న కింగ్.. కూలీ సినిమాతో విలన్ గా మెప్పించాడు. సైమన్ గా నాగ్ స్టైలిష్ లుక్ కు తమిళ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యిపోయారు. మార్కెట్ లో సైమన్ క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం నాగ్ తన 100 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. తమిళ్ డైరెక్టర్ రా కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో కింగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Shalini Pandey: ఒంటిపై బట్టలు లేకుండా అర్జున్ రెడ్డి భామ హంగామా

Anupama Parameswaran: కమర్షియల్‌ సినిమాలో వెయ్యి తప్పులున్నా పట్టించుకోరు

Updated Date - Aug 25 , 2025 | 09:15 PM