Shalini Pandey: ఒంటిపై బట్టలు లేకుండా అర్జున్ రెడ్డి భామ హంగామా
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:23 PM
అర్జున్ రెడ్డి (Arjun Reddy) భామ హద్దు దాటిందా అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. షాలిని పాండే(Shalini Pandey).. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది.
Shalini Pandey: అర్జున్ రెడ్డి (Arjun Reddy) భామ హద్దు దాటిందా అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. షాలిని పాండే(Shalini Pandey).. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది. ముద్దుగా.. బొద్దుగా అమ్మడి అందానికి.. ప్రీతీ పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన షాలినిని చూసి భవిష్యత్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒక్కటి అయితే.. ఇక్కడ జరిగింది మరొకటి.
అర్జున్ రెడ్డి సినిమా తరువాత షాలిని కేవలం కొన్ని సినిమాలకే పరిమితమయ్యింది. అవి కూడా ఆశించినఫలితాన్ని అందుకోలేదు. దీంతో టాలీవుడ్ లో కలిసి రాలేదని బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నించింది. దానికోసం బొద్దుగా ఉన్న ఈ భామ బక్కచిక్కి జీరో సైజ్ కు చేరుకుంది. అసలు ఒకానొక సమయంలో షాలినిని తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోయారు అంటే అతిశయోక్తి కాదు. ఎలాగోలా బాలీవుడ్ లో మహరాజ్, డబ్బా కార్టెల్ లాంటి ప్రొజెక్ట్స్ లో ఛాన్స్ పట్టేసి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపారేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో అందాల అరబోతతో అభిమానులకు దగ్గరగా ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. బరువు తగ్గాక షాలిని బికినీలోనే ఎక్కువ కనిపిస్తుంది. బీచ్ ఒడ్డునా.. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈసారి మాత్రం ఈ ముద్దగుమ్మ హద్దు దాటేసిందని నెటిజన్స్ అంటున్నారు. తాజాగా షాలిని ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఉదయం నుంచి ఆమె చేసిన ప్రతి పనికి సంబంధించిన ఫోటోలను అభిమనులతో పంచుకుంది. అందులో షాలిని ఒంటిపై సగంవరకు బట్టలు లేకుండా బెడ్ పై పడుకొని బుక్స్ చదువుతూ కనిపించింది. ఎద అందాలను కూడా పట్టించుకోకుండా కాళ్లు ఊపుతూ ఆ బుక్ లో లీనమై కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఏంటి ఇది మరీ టూ మచ్ గా షాలిని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్యనా.. మజాకానా.. హీరోయిన్ ను మించి ఉందిగా
Nara Rohith: ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు..