సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiru- Mirai Director: చిరంజీవితో మిరాయ్ డైరెక్టర్

ABN, Publish Date - Sep 15 , 2025 | 03:57 PM

ఒక్కసారి సునామీలా వచ్చి ప్రేక్షకుల్ని షేక్ చేసిన అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేసుకున్నాడు ఆ యువకుడు. విజువల్ ట్రీట్ తో మెప్పించిన అతగాడు త్వరలో మెగా జర్నీని స్టార్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni)... 'మిరాయ్' (Mirai ) తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్నాడు. ఈ మూవీకి అటు డైరెక్టర్ గా ఇటు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే దర్శకుడిగా తన తదుపరి ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. కానీ 'మిరాయ్'కు సీక్వెల్ వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నా... అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ కార్తీక్ కెరీర్ ఊపందుకునే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. 'మిరాయ్' లాంటి మూవీతో వండర్స్ క్రియేట్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.


'మిరాయ్'లో యాక్షన్, విజువల్స్, బీజీయం తో మూవీ లవర్స్ నే కాదు మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi)ని ఫిదా చేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 'సూర్య వర్సెస్ సూర్య' (Surya vs Surya), 'ఈగల్' (Eagle) వంటి చిత్రాలతో హిట్ ను అందుకోకపోయినా, మంచి మార్కులే కొట్టేశాడు. అలాంటి కార్తీక్ 'మిరాయ్' తర్వాత చిరు సినిమాకు పని చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. బాబీ (Bobby) డైరెక్షన్‌లో చిరంజీవి చేస్తున్న మూవీలో కార్తీక్ కు ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ సినిమా కోసం కార్తీక్‌ని సంప్రదించారట. కార్తీక్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడట. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇప్పటి వరకు కార్తీక్ టాప్ హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేయలేదు. 'నిన్ను కోరి, ఎక్స్ ప్రెస్ రాజా, ధమాకా, కార్తికేయ, అ, కృష్ణార్జున యుద్ధం, చిత్రలహరి' వంటి చిత్రాలకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. ఒకవేళ ఇప్పుడు చిరు సినిమా ఓకే అయితే అతగాడి కెరీర్‌కు ఒక మైలురాయి కావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


ఇదిలా ఉండగానే కార్తీక్ కు సంబంధించి మరో న్యూస్ వైరల్ గా మారింది. చిరంజీవికి కార్తీక్ పనితనం నచ్చితే.. మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరోకి దర్శకత్వం వహించే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రెజెంట్ అనిల్ రావిపూడితో 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara VaraPrasad Garu) మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత అటు శ్రీకాంత్ ఓదెల ఇటు బాబీ మూవీలను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. దీంతో కార్తీక్ మెగా జర్నీని ప్రారంభిస్తే... అటు డైరెక్టర్ గా ఇటు సినిమాటోగ్రాఫర్ గా కెరీర్‌ రెండింటికీ పెద్ద మైలేజ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Prabhas: కేరళలో 'రాజాసాబ్' ఆటాపాటా

Read Also: Dhanush: 'ఇడ్లీ కొట్టు' నుంచి మాంచి మెలోడీ సాంగ్ వచ్చేసింది 

Updated Date - Sep 15 , 2025 | 04:12 PM