Kajal Choudhary: అనగనగా.. కాజల్ చౌదరికి వరుస అవకాశాలు
ABN, Publish Date - May 23 , 2025 | 06:37 PM
'అనగనగా' ఫేమ్ కాజల్ చౌదరి ఒకే వారంలో రెండు కొత్త సినిమాలను మొదలు పెట్టేసింది. నవీన్ చంద్ర హీరోగా ఐదు రోజుల క్రితం ఓ చిత్రం మొదలు కాగా శుక్రవారం కార్తీక్ రాజు మూవీ స్టార్ట్ అయ్యింది.
బీహార్ లోని పాటలీపత్రకు చెందిన కాజల్ చౌదరి (Kajal Choudhary) పైలెట్ కావాల్సింది ఫిలాసఫీలో పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తమిళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ముందుకు వచ్చింది. తెలుగులో సుమంత్ (Sumanth) సరసన 'అనగనగా' (Anaganaga) చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. తొలి చిత్రంలోనే పిల్లాడి తల్లిగా నటించి, మెప్పించిన కాజల్ చౌదరిని చూసి తెలుగు సినిమా ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. సుమంత్, కాజల్ చౌదరి జోడి స్క్రీన్ మీద చూడముచ్చటగా ఉండటమే కాదు... ఆమె పాత్రలోని వేరియేషన్స్ కూడా దర్శక నిర్మాతలను ఆకట్టుకున్నాయి. అందంతో పాటు అభినయానికి కాజల్ చౌదరి తీసిపోదని భావించిన వారు తమ చిత్రాలలో ఆఫర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. 'అనగనగా' ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయ్యి రెండు మూడు వారాలు కాకముందే కాజల్ చౌదరి రెండు కొత్త ఆఫర్స్ ను తన కిట్ లో వేసుకుంది. విశేషం ఏమంటే... ఆ సినిమాలు పూజా కార్యక్రమాలతో మొదలైపోయాయి కూడా. నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా ఐదు రోజుల క్రితం 'కరాలి' (Karaali) అనే సినిమా మొదలైంది. అందులో రాశీసింగ్ (Rasi Singh) తో పాటు కాజల్ చౌదరి కూడా నాయికగా నటిస్తోంది. రాకేశ్ పొట్టా దర్శకత్వంలో మందలపు శివకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read: Megastar: చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ...
Also Read: Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 లక్షలు... చిక్కుల్లో డ్రాగన్ బ్యూటీ... లిక్కర్ స్కాంలో పేరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి