Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 ల‌క్ష‌లు... చిక్కుల్లో డ్రాగ‌న్ బ్యూటీ... లిక్క‌ర్ స్కాంలో పేరు

ABN , Publish Date - May 23 , 2025 | 09:37 AM

ఇటీవ‌ల త‌మిళ చిత్రం డ్రాగ‌న్ సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారి లేటెస్ట్ సౌత్ సిని సెన్షేష‌న్, అస్సాం బ్యూటీ క‌యాదు లోహ‌ర్ కొత్త స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంది.

kayadhu

ఐదేండ్ల క్రితం శ్రీవిష్ణు అల్లూరి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇటీవ‌ల త‌మిళ చిత్రం డ్రాగ‌న్ (Dragon) సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారింది అస్సాం బ్యూటీ క‌యాదు లోహ‌ర్ (Kayadu Lohar). ఆ ఒక్క చిత్రంతో వ‌చ్చిన గుర్తింపుతో ఇప్పుడు చేతిలో డ‌జ‌న్‌కు పైగా సినిమాల‌తో ఇత‌ర యువ హీరోయున్ల‌ను మించిన‌ జెట్ స్పీడుతో దూసుకెళుతుంది. యూత్ క‌ల‌ల‌రాణిగా అదిరిపోయే ఫాలోయింగ్ సైతం సొంతం చేసుకుంది. ఇదే స్పీడుతో తెలుగులో విశ్వ‌క్ సేన్‌, ర‌వితేజ‌, త‌మిళంలో శింబు, జీవీ ప్ర‌కాశ్, ఆధ్వ‌ర్వ ముర‌ళి హీరోగా వ‌స్తున్న‌ సినిమాల్లో అవ‌కాశం ద‌క్కించుకుంది.

Kayadu Lohar

అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు పెద్ద‌చిక్కులో ప‌డింది. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో బ‌య‌టప‌డి సంచ‌ల‌నం సృష్టిస్తున్న త‌మిళ‌నాడు TASMAC లిక్క‌ర్ స్కామ్ (Tasmac Scam)లో క‌యాదు లోహ‌ర్ (Kayadu Lohar)కు ప్రమేయం ఉన్న‌ట్లు అధికారులు గుర్తించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ లిక్క‌ర్ కుంభ‌కోణంలో భాగంగా నిర్వ‌హించిన ఈడీ రైడ్స్‌లో ప‌ట్టుబ‌డిన నిందితులు ఏర్పాటు చేసిన మై ఫ్రోఫైల్‌ నైట్ పార్టీల్లో క‌యాదు పాల్గొంద‌ని అందుకు గాను రూ.35 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో న్యూస్ బాగా వైర‌ల్ అవుతోంది.

Kayadu Lohar

కాగా ఈ వార్త‌ల‌పై స‌ద‌రు న‌టి క‌యాదు లోహ‌ర్ (Kayadu Lohar) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అంతా ఫేక్‌ న్యూస్ అని అన‌వ‌స‌రంగా ఇన్వాల్స్ చేస్తున్న‌ట్లు వాపోయింద‌ని తెలుస్తోంది. అయితే ఇంతా జ‌రుగుత‌న్న‌ప్ప‌టికీ హీరోయిన్‌ క‌యాదు అధికారికంగా ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డా ప్ర‌క‌ట‌న చేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - May 23 , 2025 | 01:31 PM