Megastar: చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ...
ABN , Publish Date - May 23 , 2025 | 05:57 PM
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోయింది. శుక్రవారం హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'విశ్వంభర' (Vishwambhara) షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో ఆయన మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేశారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిరంజీవి 157వ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించుకుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి (Saahu Garapati), గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల (Susmitha Konidela) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార (Nayantara) నటించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఈ యేడాది సంక్రాంతి బరిలో విజేతగా నిలిచిన వెంకటేశ్ ఈ సినిమాలోనూ కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను మరో స్థాయిలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ మొన్నటి సినిమా ప్రచారం ప్రారంభించిన మేకర్స్ చివరకు అదే పేరును ఖరారు చేశారు. అలానే ఈ సినిమాను 'సంక్రాంతికి రప్ఫాడించేద్దాం' అంటూ ప్రచారం చేస్తోంది చిరు అండ్ అనిల్ రావిపూడి టీమ్. చివరకు ఇదే టైటిల్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరు ఒరిజినల్ పేరైన శంకర్ వర ప్రసాదే. అలానే ఇందులో మరో నాయికగా కేథరిన్ నటించబోతోందని తెలుస్తోంది.
శుక్రవారం హైదరాబాద్ లో మొదలైన రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ దీనికి ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్.. బరిలోకి దిగుతున్నాడు
Also Read: Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 లక్షలు... చిక్కుల్లో డ్రాగన్ బ్యూటీ... లిక్కర్ స్కాంలో పేరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి