Kajal Aggarwal: కాజల్ కి యాక్సిడెంట్.. ఆమె ఏమన్నదంటే

ABN , Publish Date - Sep 09 , 2025 | 02:45 PM

సోషల్ మీడియా వచ్చాకా ఏ వార్త నిజమో.. ఏ వార్త అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది.

Kajal Aggarwal

Kajal Aggarwal: సోషల్ మీడియా వచ్చాకా ఏ వార్త నిజమో.. ఏ వార్త అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో మరీ దారుణంగా తయారయ్యింది. వ్యూస్ కోసం, లైక్స్ కోసం.. సీనియర్ నటీనటులను చంపేస్తున్నారు. కొన్నిరోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించకపోతే వారికి ఏదో అయ్యిపోయిందని పుకార్లు పుట్టిస్తున్నారు. చివరికి వారే మీడియా ముందుకు వచ్చి మేము బతికున్నాం అని చెప్తే తప్ప ప్రేజలు నిజాన్ని నమ్మడం లేదు.


ఇక గతరాత్రి నుంచి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు యాక్సిడెంట్ అయ్యిందని, చాలా సీరియస్ గా ఉందని సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇకదీంతో కాజల్ అభిమానులు ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాజల్ వెంటనే స్పందించింది. తనకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదని, తాను ఆరోగ్యంగా ఉన్నానని ఎక్స్ ద్వారా అభిమానులకు తెలిపింది.


' నాకు ప్రమాదం జరిగిందని ( ఇక నేను లేను) కొన్ని నిరాధారమైన వార్త నా వరకూ వచ్చింది. ఇది చూసి నిజంగా నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. దేవుడి దయవల్ల, నేను పూర్తిగా క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దీనికి బదులుగా నిజాన్ని నలుగురికి పంచండి' అంటూ చెప్పుకొచ్చింది. ఇక కాజల్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏ రూమర్ ఎవరు క్రియేట్ చేశారు అనేది ఇంకా తెలియరాలేదు.

Teja Sajja: 'మిరాయ్'లో వైబ్ సాంగ్ ఉండదా...

Weapons OTT: ఓటీటీలో.. వెన్నులో వ‌ణుకు పుట్టించే హ‌ర్ర‌ర్ సినిమా! కేవ‌లం వారికి మాత్ర‌మే

Updated Date - Sep 09 , 2025 | 02:45 PM