K Ramp: దీపావళి విన్నర్..  రూ.40 కోట్లకు పైగా గ్రాస్  

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:14 PM

కిరణ్ అబ్బవరం నటించిన 'K-ర్యాంప్' సినిమా బాక్సాఫీస్  వద్ద  సత్తా చూపిస్తోంది. వసూళ్లలో సునామీని తలపిస్తుంది. ఇప్పటిదాకా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.


కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన 'K-ర్యాంప్' (K ramp) సినిమా బాక్సాఫీస్  వద్ద  సత్తా చూపిస్తోంది. వసూళ్లలో సునామీని తలపిస్తుంది. ఇప్పటిదాకా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అన్ని కేంద్రాల్లో మూడో వారం దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. 'మంచి కంటెంట్స కు సపోర్ట్ అందిస్తామని   'K-ర్యాంప్'  విజయంతో తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. స్టడీ కలెక్షన్స్ తో మొదలైన సినిమా బాక్సాఫీస్ జర్నీ.. పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తోంది.

Sandeep Reddy vanga: శివ రీ రిలీజ్.. సందీప్ రెడ్డి ఏమన్నారంటే...


నగరాలతో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో రన్ కంటిన్యూ అవుతోంది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు  సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు' అని మేకర్స్ఈ పోస్టర్ రిలీజ్ చేసి తెలిపారు.  హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద  రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా ఇందులో హీరోయిన్ గా నటించింది. 

ALSO READ: Allu Sirish: అల్లు శిరీష్‌ లవ్‌స్టోరీ.. ఎలా మొదలైందంటే..

Telugu Indian Idol -4: మాస్ మహారాజా స్పెషల్ గెస్ట్.. విజేతకు ట్రోఫీ

Shah Rukh Khan: కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటికీ అదే ఫార్ములా

India Jjoy 2025: హైదరాబాద్‌లో.. ‘ఇండియా జాయ్‌’ కాన్‌క్లేవ్‌





Updated Date - Nov 02 , 2025 | 04:23 PM