Sandeep Reddy vanga: శివ రీ రిలీజ్.. సందీప్ రెడ్డి ఏమన్నారంటే
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:45 PM
నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'శివ' చిత్రం ఇప్పటికి ప్రత్యేకమే! 1990లో విడుదలైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 'శివ' రీ - రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు వంగ సందీప్ రెడ్డి స్పందించారు. ఈ చిత్రం ప్రభావం తనపై చాలా ఉందన్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్న ఆయన మరోసారి సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఈ మూవీ ఈ నెల 14న రీ రిలీజ్ (Shiva Re Release) కానున్న సందర్భంగా నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు.