India Jjoy 2025: హైదరాబాద్‌లో.. ‘ఇండియా జాయ్’ కాన్‌క్లేవ్
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:09 PM
‘ఇండియా జాయ్’ ఫెస్టివల్ 8వ ఎడిషన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ఘనంగా జరిగింది.
‘ఇండియా జాయ్’ ఫెస్టివల్ 8వ ఎడిషన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ఘనంగా జరిగింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల సమ్మేళనంగా ఈ వేడుక సాగింది. ఈ కాన్‌క్లేవ్‌లో ‘దేశీ టూన్స్’ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఏడాది థీమ్ అయిన ‘ద పవర్ ఆఫ్ ఒరిజినల్స్’ ద్వారా మన మూలాలకు చెందిన అనేక విభిన్న కథల్ని దేశీ టూన్స్ ఈ వేదికపై ఆవిష్కరించి, భారతీయ కథల వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటింది.
హైదరాబాద్ యానిమేషన్ హబ్‌గా మారుతున్న తరుణంలో ఇలాంటి వేడుకలు నిర్వహించడం మంచి పరిణామం అని తెలంగాణ వీఎ్‌ఫఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు (టీవీఏజీఏ) రాజీవ్ చిలకా పేర్కొన్నారు. ‘మన ఊహాశక్తి, పనితనంతో ప్రపంచ యానిమేషన్ రంగానికి నాయకత్వం వహించే దిశగా మనం ఎదుగుతున్నాం’ అని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. ‘దేశీ టూన్స్ భారతదేశ సృజనాత్మక శక్తిని సరైన సమయంలో ఆవిష్కరిస్తోంది’ అని మరో దర్శకుడు అశ్విన్ కుమార్ చెప్పారు.