Jr Ntr: డ్రాగన్‌ లేటెస్ట్‌ షెడ్యూల్‌ ఎప్పట్నుంచి అంటే..

ABN , Publish Date - Aug 24 , 2025 | 09:35 AM

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) సినిమా షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) 'వార్‌-2' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించిన సినిమా ఇది. అలాగే తారక్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సినిమా కూడా. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో సూపర్‌హిట్‌ అవుతుందని కాలర్‌ ఎగరేసి మరీ సవాల్‌ విసిరారు తారక్‌. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) సినిమా షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారంలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకోనందని తెలిసింది.

Neel.jpg

హైదరాబాద్‌లో నెలకు పైగా సాగనున్న ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో తారక్‌పై భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు నీల్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్‌ సరసన రుక్మిణి వసంత్‌ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ (Dragon) టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ప్రకటించలేదు.

ALSO READ: Sankar Kumar: ప్రముఖ కార్టూనిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ శంకు కన్నుమూత


Bad Girlz: సిద్ శ్రీరామ్.. మ‌రోసారి అద‌ర‌గొట్టాడుగా! ఇలా చూసుకుంటానే.. లిరిక‌ల్ వీడియో సాంగ్‌

Madharaasi: బ‌క్కోడు.. మ‌రో పాట‌తో వ‌చ్చాడు! వ‌ర‌...వ‌ర వ‌ర‌ద‌ల్లే వీడియో సాంగ్‌

Updated Date - Aug 24 , 2025 | 12:46 PM