సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sudheer Babu: జానపద గాథతో 'జటాధర'

ABN, Publish Date - Sep 15 , 2025 | 06:57 PM

సుధీర్ బాబు హీరోగా రూపుదిద్దుకున్న 'జటాధర' మూవీ నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఇందులో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్యా ఖోస్లా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్‌ దీనిని డైరెక్ట్ చేస్తున్నారు.

Jatadhar

నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తున్న తాజా చిత్రం 'జటాధర' (Jatadhara) లో ఆసక్తికరమైన స్టార్ కాస్ట్ ఉంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ భామ, శతృఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలానే చాలా కాలం తర్వాత శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) తెలుగు సినిమా రంగంలోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. అప్పట్లో ఉదయ్ కిరణ్‌ 'లవ్ టుడే'లో హీరోయిన్ గా నటించిన టీ-సీరిస్ అధినేత భూషణ్ కుమార్ భార్య దివ్యా ఖోస్లా (Divya Khossla) కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్‌, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ తదితరులు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. దీనికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించబోతోందని వారు తెలిపారు.


జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా గురించి జీ స్టూడియోస్ సీబీఓ ఉమేశ్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ, 'జటాధర' సాధారణ సినిమా కాదు. ఇది ఒక గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ను ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. ఈ మూవీ స్కేల్, స్టోరీ టెల్లింగ్, విజన్ పరంగా ఇది ఓ కొత్త లోకంలోకి ఆడియెన్స్ కు తీసుకెళ్తాయి' అని అన్నారు. ఇది ఎమోషనల్ గా, విజువల్ గా రేర్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందని ప్రేరణ అరోరా (Prerna Arora) తెలిపారు. 'జటాధర' ఒక ఫోక్ టేల్ నుండి పుట్టిన అద్భుతమైన కథ అని, డివైన్ పవర్, కాస్మిక్ డెస్టినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని దర్శకులు అభిషేక్, వెంకట్ కళ్యాణ్‌ చెప్పారు.

Updated Date - Sep 15 , 2025 | 07:02 PM