Tollywood Heroines: సీనియర్ హీరోస్ అయినా పర్లేదు అంటున్న కుర్ర హీరోయిన్లు
ABN, Publish Date - Oct 25 , 2025 | 07:12 PM
మొన్నటి దాకా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నటసింహ బాలకృష్ణ (Balakrishna), కింగ్ నాగార్జున (Nagarjuna), విక్టరీ వెంకటేశ్ (Venkatesh) వయసుకు తగ్గ హీరోయిన్స్ దొరకడం కష్టంగా ఉందని సినీజనం తరచూ చెప్పేవారు.
Tollywood Heroines: మొన్నటి దాకా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నటసింహ బాలకృష్ణ (Balakrishna), కింగ్ నాగార్జున (Nagarjuna), విక్టరీ వెంకటేశ్ (Venkatesh) వయసుకు తగ్గ హీరోయిన్స్ దొరకడం కష్టంగా ఉందని సినీజనం తరచూ చెప్పేవారు. అయితే వీరిలోనూ కొందరి సరసన యంగ్ హీరోయిన్స్ నటించి మురిపించిన వైనాన్ని మరచిపోరాదు. ఎక్కువ మంది పేరున్న యంగ్ హీరోయిన్స్ మాత్రం ఈ నలుగురు సీనియర్ స్టార్స్ తో కలసి నటించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కారు. ఎందుకంటే సీనియర్ స్టార్స్ తో నటిస్తే తమ వయస్సు కూడా అయిపోయిందని భావిస్తారేమో అని వారు అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేసేవారు. కానీ, ఇప్పుడు వయస్సుతో సంబంధం లేదు అంటూ కుర్ర హీరోయిన్లు.. సీనియర్ హీరోస్ కు సైతం సై అంటున్నారు.
సీనియర్ హీరోస్ అందరూ 65 ఏళ్ళ వయసు దాటినవారే. దాంతోనే కొందరు హీరోయిన్స్ వారితో నటిస్తే తమ కెరీర్ కు అక్కడే ఫుల్ స్టాప్ పడుతుందేమో అని డౌట్ పడేవారు. కానీ, ఈ సీనియర్ స్టార్స్ కు ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదన్న విషయం మెల్లగా తెలుసుకున్నారు. నిజానికి యంగ్ హీరోస్ కంటే సీనియర్ స్టార్స్ తో నటిస్తేనే జనాల్లో ఇట్టే గుర్తింపు లభిస్తుందన్న నమ్మకానికి వచ్చారు. అలాంటి వారు ఏ మాత్రం సంకోచించకుండా సీనియర్ హీరోస్ తో నటించడానికి ఓకే చెబుతున్నారు. గతంలో ప్రగ్యా జైస్వాల్, ఆషిక రంగనాథ్ వంటివారు అదే తీరున సాగారు. అంతేకాదు సీనియర్ స్టార్స్ తో నటిస్తే నటనకు అవకాశం ఉన్న పాత్రలూ లభిస్తాయని యంగ్ హీరోయిన్స్ నమ్ముతున్నారు. అలా నమ్మవడం వల్లే వెంకటేశ్ తో 'సంక్రాంతికి వస్తున్నాం'లో మీనాక్షి చౌదరి నటించింది. నిజానికి యంగ్ హీరోస్ తో నటించిన దానికన్నామిన్నగా మీనాక్షి చౌదరికి వెంకటేశ్ సినిమా గుర్తింపు సంపాదించి పెట్టింది అని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఆ మధ్య కొందరు భామలు చిరంజీవితోనూ నటించాలని ఉందని చెప్పారు. చిరంజీవి రాబోయే సినిమాల్లో యంగ్ హీరోయిన్స్ కొందరు ఆయనతో చిందేయనున్నారనీ తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేశ్ హీరోగా నటించే సినిమాలో 'కేజీఎఫ్' హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నవిషయం తెల్సిందే. అలాగే నాగార్జున 100వ సినిమాలోనూ ఓ యంగ్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. అఖండ 2 లో ఇప్పటికే బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటిస్తుందని తెల్సిందే. 'అఖండ-2' వచ్చాక బాలయ్యతోనూ మరికొందరు యువకథానాయికలు జోడీ కట్టవచ్చు. ఇలా సీనియర్ స్టార్స్ కు ఇప్పుడు హీరోయిన్స్ కొరత తీరినట్టే అంటున్నారు పరిశీలకులు. అయితే ఈ సీనియర్ హీరోలతో జతకట్టిన హీరోయిన్స్ కు లేని బాధ ట్రోలర్స్ఈ కు ఎక్కువైంది. కూతురు వయస్సున్న హీరోయిన్స్ తో రొమాన్స్ ఏంటి అని ట్రోల్స్ చేస్తున్నారు. వీటిని అటు హీరోలు పట్టించుకోవడం లేదు.. ఇటు హీరోయిన్లు పట్టించుకోవడం లేదు అనేది గమనార్హం. మరి ఈ తీరు ఎంత కాలం సాగుతుందో చూడాలి.
Rashmika Mandanna: నా టైప్ ఎవరో అందరికీ తెలుసు..
Fauzi : సీక్వెల్ స్టార్ గా మారిపోతున్న ప్రభాస్