Mohanlal: కన్నప్ప నుంచి.. కిరాత వచ్చేశాడు
ABN , Publish Date - May 21 , 2025 | 12:19 PM
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ జన్మదినంను పురస్కరించుకుని కన్నప్ప చిత్రం నుంచి మోహన్ లాల్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలతో కన్నప్ప సినిమాపై మీద మరింత బజ్ ఏర్పడింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అంతా మాట్లాడుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణు చెబుతున్న విషయాలు.. సినిమాపై ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మంచు విష్ణు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన విష్ణు అమెరికాలో కలియ తిరిగారు. కామిక్ బుక్ ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఇదిలాఉంటే ఇప్పటికే ఈ కన్నప్ప (Kannappa) సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తోన్న అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి దిగ్గజ నటులు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ జన్మదినంను పురస్కరించుకుని కన్నప్ప చిత్రం నుంచి మోహన్ లాల్ (Mohanlal) కిరాత (Kirata) లుక్‌ను, ఓ చిన్న గ్లిమ్స్ సైతం మేకర్స్ విడుదల చేశారు.