Jr Ntr: ఏదీ ప్లాన్ చేయను.. కానీ అలా గుర్తుండిపోవాలనుకుంటా..
ABN, Publish Date - Aug 05 , 2025 | 07:21 PM
జూనియర్ ఎన్టీఆర్ (NTR) పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఆయన ఫొటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ (Esquire India) తాజా ఎడిషన్‌లో కవర్ పేజీగా వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ (NTR) పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఆయన ఫొటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ (Esquire India) తాజా ఎడిషన్‌లో కవర్ పేజీగా వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో, మ్యాగజైన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో షూట్‌ను దుబాయ్‌లో నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఎస్క్వైర్’ మ్యాగజైన్‌తో ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ నటుడిగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు. ‘జీవితంలో ఏది ఎలా జరగాలో ఎప్పుడు జరగాలో నేనెప్పుడూ ప్రణాళి వేసుకోలేదు. ‘కుంగ్ ఫూ పాండా’లో ఒక కొటేషన్ నాకు చాలా ఇష్టం. ‘నిన్నటి రోజు చరిత్ర.. రేపటి రోజు తెలియని మర్మం. కానీ, ఈ రోజు మన చేతిలో ఉన్న గొప్ప బహుమతి’ నా దృష్టి ఎప్పుడూ ప్రెజెంట్ పైనే ఉంటుంది. నటుడిగా నేను ఏది చేయడానికైనా సిద్థంగా ఉంటా. నా కుటుంబంలో సినీ వారసత్వం ఏమవుతుందో ఇప్పటికిప్పుడు నాకు తెలియదు. అందుకోసం నేనేమీ ప్లాన్ చేయలేదు. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే కథలను చెప్పడం ద్వారా ప్రేక్షకులకు దగ్గర కావాలనుకున్నా. కానీ, అన్నిటికంటే ముఖ్యమైనది భావోద్వేగాలను కలగలిపిన నిజాయతీ పరుడిగా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నా’అని తారక్ చెప్పారు.
ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో నటించిన ‘వార్ -2’ చిత్రం విడుదలకు సిద్దమైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తారక్ కీలక పాత్ర పోషించారు.
ALSO READ: Tollywood: చిరంజీవి ఇంట్లో ముగిసిన నిర్మాతల మీటింగ్..
Mass Jathara: ఏదేమైనా.. ధమాకాలో ఉన్నంత దమ్ము.. ఇందులో లేదురా
Hrithik Roshan: ఆ ఫలితం నాకు తెలిసింది.. మీరూ ట్రై చేయండి..
NTR Cover Page: ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌పై ఎన్టీఆర్
Director SJ shiva: నిర్మాతల డబ్బు విరాళంగా మారుతోంది