They Call Him OG: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
ABN, Publish Date - Oct 18 , 2025 | 06:58 PM
నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. ఏ ముహూర్తాన థమన్ ఈ మ్యూజోక్ ఓజీ (OG)కి కొట్టాడో కానీ, అప్పటి నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాను వదలడం లేదు.
They Call Him OG: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. ఏ ముహూర్తాన థమన్ ఈ మ్యూజోక్ ఓజీ (OG)కి కొట్టాడో కానీ, అప్పటి నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాను వదలడం లేదు. ఏ హీరోకు ఎలివేషన్ ఇవ్వాలన్నా ఈ సాంగ్ నే.. సీరియల్, రియాల్టీ షో, రీల్స్, చివరికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో పెళ్లి కొడుకు ఎంట్రీకి కూడా ఇదే సాంగ్. అంతలా ఈ సాంగ్ గుర్తింపు తెచ్చుకుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ భారీ విజయాన్ని అందుకుంది. ఒక అభిమాని.. తన అభిమాన హీరోను ఏ విధంగా చూపించాలనుకుంటాడో అదే విధంగా పవన్ ను సుజీత్ చూపించాడు.
ఓజాస్ గంభీరగా పవన్ లుక్ కానీ, నటన కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక సినిమా మొత్తం పవన్ ఎలివేషన్స్ తో పిచ్చెక్కించాడు. సుజీత్ కి తోడు థమన్ యాడ్ అయ్యాడు. ఇక థమన్ మ్యూజిక్ ఓజీకి హైలైట్. ముఖ్యంగా హంగ్రీ చీతా సాంగ్ అయితే థియేటర్ లో బ్లాస్ట్ అయ్యింది. ఇక ఎప్పుడెప్పుడు హంగ్రీ చీతా వీడియో సాంగ్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూసారు.
తాజాగా ఆ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియోలో పవన్ అలా నడుచుకు రావడం.. బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ వస్తూ ఉండడం నెక్స్ట్ లెవెల్. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఓజీ అక్టోబర్ 23 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్దమయ్యింది. మరి థియేటర్ లో రచ్చ చేసిన ఓజీ.. ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Biggboss 9: దివ్వెల మాధురి పవర్ పీకి పారేశారు..
Pawan kalyan: ఫ్యాన్స్ కు పండగ.. మరో రెండు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్