Pawan kalyan: ఫ్యాన్స్ కు పండగ.. మరో రెండు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:11 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ మధ్య తన ఓజీ(OG) మూవీ వేడుకలో ఇకపై సినిమాలకూ సమయం కేటాయిస్తానని సెలవిచ్చారు.

Pawan Kalyan

Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ మధ్య తన ఓజీ(OG) మూవీ వేడుకలో ఇకపై సినిమాలకూ సమయం కేటాయిస్తానని సెలవిచ్చారు. దాంతో అభిమానులు ఆనందంతో చిందులు వేశారు. ఆ ఊపులో పవన్ కళ్యాణ్ ఓజీకి ఆరంభంలో వసూళ్ళ వర్షం కురిపించారు ఫ్యాన్స్. ఓజీ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే యేడాది వేసవిలో వెలుగు చూడనుంది. గతంలో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఈ నేపథ్యంలో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పైనా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పాటు పవన్ కళ్యాణ్ వరుసగా రెండు చిత్రాలు అంగీకరించారన్న టాక్ కూడా ఆయన ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపుతోంది.


రాజకీయాల్లోకి అడుగుపెట్టే సమయానికి పవన్ అసలు సినిమాలు చేయనని చెప్పారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన పలు సినిమాలు చేశారు. ఇక పదవి వచ్చాక పూర్తిగా సినిమాలు మానేస్తారేమో అనుకుంటే.. ఇచ్చిన మాట కోసం మూడు సినిమాలను చేసి రిలీజ్ కు సిద్ధం అయ్యేలా చేయగలిగారు. రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ మూడు సినిమాల తరువాత పవన్ ఇక సినిమాలు చేయడు అనుకున్నారు. కానీ, పవన్.. రాజకీయాల్లో ఉన్నా కూడా సినిమాలు చేయనున్నట్లు చెప్పడంతో అభిమానులు గంతులు వేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఇంతకు ముందు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ హీరోగా ఓ సినిమాకు పూజాకార్యక్రమాలు జరిగాయి. పవన్ సన్నిహితుడు రామ్ తాళ్ళూరి ఆ సినిమాకు నిర్మాత. కేవీయన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలోనూ పవన్ నటించడానికి అంగీకరించారని వినికిడి. ఓ వైపు ఉపముఖ్యమంత్రిగా సాగుతూనే, మరోవైపు సినిమాల్లో నటించడమంటే మాటలు కాదు... అయినా పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో పవన్ సినిమాలు అంగీకరిస్తున్నారని సమాచారం. ఇక ఇది కాకుండా ఇండస్ట్రీని షేక్ చేసి కాంబో ఓకే అయ్యిందని టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ తో కేవీయన్ ప్రొడక్షన్స్ నిర్మించబోయే చిత్రానికి ఇద్దరు తమిళ దర్శకుల పేర్లు విశేషంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు లోకేశ్ కనగరాజ్, మరొకరు హెచ్. వినోద్... అయితే లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించడానికే పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఇన్ సైడ్ టాక్.


లోకేష్ దర్శకత్వంలో వచ్చిన కూలీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో మళ్ళీ ఓ బంపర్ హిట్ పట్టేందుకు లోకేశ్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రూపొందించారని వినికిడి. అయితే ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే కేవీయన్ ప్రొడక్షన్స్ కూడా పలు చిత్రాలు నిర్మిస్తోంది.. ఈ నేపథ్యంలో పవన్ ఇప్పటికిప్పుడు అంగీకరించినా, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. మరి సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఎప్పుడో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే సినిమాల్లో నటించడానికి పవన్ వేస్తున్న ప్లాన్స్ చూసి ఆయన మరీ స్పీడుమీదున్నాడు అంటున్నారు జనం. మరెప్పుడు ఈ రెండు ప్రాజెక్ట్స్ పట్టాలెక్కుతాయో చూడాలి.

Tom Cruise: కుర్ర హీరోయిన్ తో టామ్ క్రూజ్ బ్రేకప్..

గుంతకల్లులో ఐశ్వర్యా రాజేష్, రితికా నాయక్  సందడి

Updated Date - Oct 18 , 2025 | 05:11 PM