Biggboss 9: దివ్వెల మాధురి పవర్‌ పీకి పారేశారు..

ABN , Publish Date - Oct 18 , 2025 | 06:02 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 ఓ మోస్తరుగా నడుస్తోంది. ప్రస్తుతం ఇంటి సభ్యులుగా 16 మంది ఉన్నారు. ఇందులో 35వ రోజున వైల్డ్‌కార్డ్స్‌ ఎంట్రీ ద్వారా వచ్చిన వారు ఆరుగురు. వీరితో ఆట ఆడిన, ఆడకపోయినా ఇద్దరే ఫామ్‌లో ఉంటున్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 ఓ మోస్తరుగా నడుస్తోంది. ప్రస్తుతం ఇంటి సభ్యులుగా 16 మంది ఉన్నారు. ఇందులో 35వ రోజున వైల్డ్‌కార్డ్స్‌ ఎంట్రీ ద్వారా వచ్చిన వారు ఆరుగురు. వీరితో ఆట ఆడిన, ఆడకపోయినా ఇద్దరే ఫామ్‌లో ఉంటున్నారు. ఒకరు దివ్వెల మాధురి, మరొకరు ఆయేషా. ఇంట్లో ఎప్పుడు అరుపులు, ఏడుపులు తప్ప మరేమీ కనిపించడం లేదని తనూజాను నామినేట్‌ చేసింది ఆయేషా! వచ్చినప్పటి నుంచి అరుస్తూనే ఉంది. శుక్రవారం ఒక్క గేమ్‌ ఓడిపోయేసరికి ఏడుపు మొదలెట్టింది.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌లో ఉన్న దివ్వెల మాధురి హౌస్‌కు రెండో బిగ్‌బాస్‌లా భావిస్తోంది. తానే బిగ్‌బాస్‌లా కలరింగ్‌ ఇస్తుంది. అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కల్యాణ్‌పై నోరు పారేసుకుంది. తప్పెవరిదని కెప్టెన్‌ సుమన్‌ను అడిగాడు నాగార్జున. మాఽధురిదే తప్పన్నాడు. ఫ్రూప్‌ కోసం వీడియో వేసి మరీ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పు లేదు.. కానీ, మాట్లాడిన తీరు తప్పు అని మాధురికి నాగ్‌ గట్టిగా క్లాస్‌ ఇచ్చాడు. నా గొంతే అలా ఉంటుందని చెప్పగా నాగ్‌ దానిని ఖండించారు.  ‘మరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా.. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని హెచ్చరించాడు. మాధురికి ఉన్న సూపర్‌ పవర్‌ ఉంచాలా? ఎత్తేయాలా అని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగగా తీసేయడమే మంచిదన్నారు. వైల్డ్‌కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన రోజు ఆమెకు ఎలిమినేషన్‌ను రద్దు చేేస పవర్‌ ఇచ్చారు. ప్రేక్షకుల తిరస్కారంతో ఆ పవర్‌ ఇప్పుడు లేకుండా పోయింది.  

Updated Date - Oct 18 , 2025 | 06:05 PM