Hero Venkat: ‘ఓం హరుడు’తో.. వెంకట్ రీ ఎంట్రీ
ABN, Publish Date - Oct 09 , 2025 | 05:17 PM
'శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి', 'అన్నయ్య', 'ప్రేమ కోసం', 'శివ రామరాజు' లాంటి చిత్రాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు.
'శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి', 'అన్నయ్య', 'ప్రేమ కోసం', 'శివ రామరాజు' లాంటి చిత్రాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇటీవల 'ఓజి' (OG)చిత్రంలో చిన్న పాత్ర చేశారు. ఇప్పుడు మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘ఓం హరుడు’తో (Om Harudu) ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకుడు. విఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'ప్రభంజనం' సాంగ్ రిలీజ్ చేశారు. విశ్వ వేమూరి స్వరపరిచి రాసి పాడిన ఈ సాంగ్ పవర్ ఫుల్ గా వుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ చిత్రంలో హెబ్బా పటేల్, సలోని, శ్రీహరి పైల, నాటషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ: Tollywood: 2026 వేసవిలో రాబోతున్న.. మెగా ఫ్యామిలీ స్టార్స్
Gangster Drama: శింబు వర్సెస్ ఉపేంద్ర
Udhayanidhi: స్టాలిన్ మనవడి సినీ రంగ ప్రవేశం
Director Jaya shankar: అరి జర్నీ.. దర్శకుడు భావోద్వేగ పోస్ట్