Gangster Drama: శింబు వర్సెస్ ఉపేంద్ర

ABN , Publish Date - Oct 09 , 2025 | 06:11 PM

కోలీవుడ్, శాండిల్ ఉడ్ హీరోల మధ్య మరోసారి బాక్సాఫీస్ వార్ జరగబోతోందా? ఏరి కోరి ఆ తమిళ్ హీరో.. కన్నడ స్టార్ తోనే గొడవ పెట్టుకుంటున్నాడా? తన సినిమాలేవో తాను చేసుకుంటూ పోయే హీరోని.. విలన్ గా చేస్తున్నది ఎవరు? అసలు ఏం జరుగుతోంది!?

తమిళ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న శింబు (Simbu), వెట్రిమారన్ (Vetri Maaran) కాంబో చిత్రం 'అరసన్' (Arasan) ప్రకటన అభిమానుల్లో జోష్ నింపింది. 'వాడా చెన్నై యూనివర్స్‌' (Vada Chennai Universe) లో భాగమైన ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సాయి పల్లవి (Sai Pallavi ), సమంత (Samantha) హీరోయిన్లుగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ మూవీకి అనిరుధ్ (Anirudh ) సంగీతం అందిస్తుండగా... సినిమాలో విలన్ రోల్ గురించి చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఓ వెర్సటైల్ యాక్టర్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.


'అరసన్' మూవీలో శింబుకు తగిన విలన్ కోసం వెతుకుతున్నారు దర్శక, నిర్మాతలు. ఈ క్యారెక్టర్ కోసం చాలా మందిని అనుకున్నప్పటికీ.. చివరికి సెర్సింగ్ కన్నడ వెర్సటైల్ యాక్టర్ ఉపేంద్ర (Upendra) దగ్గర ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. హీరోగా, విలన్‌గా రాణిస్తున్న ఈ కన్నడ హీరో అయితే ఈ రోల్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాడని భావిస్తున్నారట మూవీ మేకర్స్. దీంతో ఉపేంద్రను సంప్రదించి.. ఒప్పించాలని ట్రై చేస్తున్నారట.

ప్రస్తుతం 'అరసన్' ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సినిమా ప్రోమో వీడియో షూట్ ఇప్పటికే పూర్తయింది. వచ్చే వారం ఇది రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ దీపావళి తర్వాత మొదలవుతుందని అంటున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా తమిళ చిత్రసీమలో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుందని శింబు అభిమానులు భావిస్తున్నారు. మరి మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read Also: Udhayanidhi: స్టాలిన్ మనవడి సినీ రంగ ప్రవేశం

Read Also: Bison: తెలుగులోనూ వస్తున్న ధృవ్‌ విక్రమ్ 'బైసన్'

Updated Date - Oct 09 , 2025 | 06:19 PM