Director Jaya shankar: అరి జర్నీ.. దర్శకుడు భావోద్వేగ పోస్ట్
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:47 PM
‘అరి’ చిత్రం (Ari) కోసం అహర్నిశలు కష్టపడ్డారు దర్శకుడు జయశంకర్(Jaya Shankar). ఏడేళ్లపాటు హిమాలయాల బాట పట్టిన ఆయనకు తట్టిన కథ ఇది. ఈ జర్నీలో ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిశారు..
‘అరి’ చిత్రం (Ari) కోసం అహర్నిశలు కష్టపడ్డారు దర్శకుడు జయశంకర్(Jaya Shankar). ఏడేళ్లపాటు హిమాలయాల బాట పట్టిన ఆయనకు తట్టిన కథ ఇది. ఈ జర్నీలో ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిశారు.. ఆశ్రమాల్లో గడిపారు. అరిషడ్వర్గాల మీద పట్టు సాధించారు. ఫలితంగా సిల్వర్ స్క్రీన్ మీద రాని కాన్సెప్ట్‌ను కథగా రాసుకున్నారు. మూడేళ్ల కష్టం ఈ కథ. నాలుగేళ్లు కష్టం తరువాత ‘అరి’ మూవీని అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. అయితే జయ శంకర్ చేసిన ఈ ప్రయాణంలో తనకు బ్యాక్ బోన్‌గా నిలిచిన, ప్రాణానికి ప్రాణమైన తండ్రి వంగ కనకయ్యని, బావ కె.వి. రావుని కోల్పోయారు. అందుకే ఈ సినిమాను వారిద్దరికీ అంకితం చేస్తునట్లు జయశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు.
‘రేపటి నుంచి ‘అరి’ ఆడియెన్స్ సొంతం. నాకు ఈ మూవీ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో నా జీవితంలోని మూల స్తంభాలైన నా తండ్రి,యుయ బావ గారు మరణించారు. అరి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను’ అని పోస్ట్ వేశారు. సాయికుమార్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: Tollywood: 2026 వేసవిలో రాబోతున్న.. మెగా ఫ్యామిలీ స్టార్స్
Gangster Drama: శింబు వర్సెస్ ఉపేంద్ర
Udhayanidhi: స్టాలిన్ మనవడి సినీ రంగ ప్రవేశం