Hyper Aadi - HHVM Review: హరిహర వీరమల్లు.. హైపర్ ఆది రివ్యూ
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:06 PM
హరిహర వీరమల్లు చిత్రాన్ని వీక్షించిన కమెడీయన్ హైపర్ ఆది రివ్యూ ఇచ్చారు. సినిమా తనకెంతో నచ్చిందని చెప్పారు.
‘హరిహర వీరమల్లు’(HHVM)చిత్రాన్ని వీక్షించిన కమెడీయన్ హైపర్ ఆది రివ్యూ (Hyper Aadi Review) ఇచ్చారు. సినిమా తనకెంతో నచ్చిందని చెప్పారు. పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయిందని అన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ‘సినిమా హై ఇచ్చే సీన్లు చాలా ఉన్నాయి. క్లైమాక్స్ సీన్‌లో పవన్‌కల్యాణ్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్, దానికి కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అదే హైతో ప్రేక్షకులంతా సినిమా నుంచి బయటకు వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని చూడాలని కోరుకుంటున్నా. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు నేను సెట్‌కి వెళ్లాను. అభిమానులు కోరుకునే అంశాలతో మంచి సినిమా ఇవ్వాలని ప్రతిసీన్ మీద ఎంతో కేర్ తీసుకుని ఇష్టంగా చేశారు. ఆయన తపన స్క్రీన్ మీద కనిపించింది. క్లైమాక్స్ ప్రతి అభిమానిని కనిపించింది. అభిమానుల కోసం ఓ హిట్ ఇవ్వు దేవుడా అని కోరుకుంటే గబ్బర్‌సింగ్ వచ్చింది. ఆ తర్వాత మరోసారి హిట్ ఇవ్వు దేవుడా అని ఈ సినిమాకు కోరుకున్నారు. అది కూడా ఆయన్ను నమ్ముకున్న ఏ.ఎం.రత్నం అనే నిర్మాతను నిలబెట్టడం కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమను బయటకు తీసుకెళ్లారు' అని అన్నారు
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. నిధీ అగర్వాల్ కథానాయిక. బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటించారు. తొలుత క్రిష్ దర్శకత్వం వహించారు. తదుపరి జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ALSO READ:
Bollywood: కబీర్ సింగ్ కు చెక్ పెట్టిన సయారా
Rashmi Gautam: ఏదీ శాశ్వతం కాదు.. మళ్లీ కలుద్దాం.. రష్మీకి ఏమైంది..
Anasuya: కొల్లగొట్టినాదిరో.. మోత మోగిపోవాల్సిందే..