Bollywood: కబీర్ సింగ్ కు చెక్ పెట్టిన సయారా
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:02 PM
ఆరేళ్ళ క్రితం వచ్చిన 'కబీర్ సింగ్' కలెక్షన్స్ ను మొదటి రోజు నుండే 'సయారా' క్రాస్ చేస్తూ సాగింది. ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ జానర్స్ లో మేటి సినిమాగా 'సయారా' నిలిచింది.
బాలీవుడ్ లవ్ స్టోరీలో చివరి సూపర్ డూపర్ హిట్ ఏది అని ఎవరిని అడిగినా... ఠక్కున చెప్పేమాట 'కబీర్ సింగ్' (Kabir Singh). షహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోనే కాదు... హిందీలోనూ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అయితే... ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత వచ్చిన మోహిత్ సూరి (Mohit Suri) మూవీ 'సయారా' (Saiyaara)... 'కబీర్ సింగ్' రికార్డులను గుర్తు చేస్తోంది. అంతేకాదు... డే వన్ నుండి 'కబీర్ సింగ్' కంటే బెటర్ కలెక్షన్స్ ను వసూలు చేస్తూ విజయపథంలో సాగిపోతోంది. ఈ యేడాది ఇంత తక్కువ స్పాన్ లో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా 'సయారా' నిలిచిపోయింది. విశేషం ఏమంటే మోహిత్ సూరి డైరెక్షన్ లో ఆదిత్య చోప్రా యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో పాపులర్ స్టార్స్ ఎవరూ లేరు. కొత్త వాళ్ళతో ఈ సినిమాను తీసి, ఈ రేర్ ఫీట్ ను సాధించాడు మోహిత్ సూరి. ప్రేమకథా చిత్రాలకు బాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ ఫిదా అవుతారని మరోసారి అతను నిరూపించాడు.
ఇక 'కబీర్ సింగ్', 'సయారా' కలెక్షన్స్ విషయానికి వస్తే... 'కబీర్ సింగ్' మొదటి ఐదు రోజుల్లో రూ. 20,25 కోట్లు, 22.75 కోట్లు, 28 కోట్లు, 17.25 కోట్లు, 16.50 కోట్ల నెట్ ను వసులూ చేసి మొత్తం 104.75 కోట్ల మొత్తాన్ని రాబట్టింది. ఇక 'సయారా' సినిమా అయితే మొదటి ఐదు రోజుల్లో వరుసగా రూ. 21.25 కోట్లు, 25.75 కోట్లు, రూ. 35 కోట్లు, రూ. 24 కోట్లు, రూ. 24.50 కోట్లు వసూలు చేసి, మొత్తం 130.50 కోట్లను కలెక్ట్ చేసింది. విశేషం ఏమంటే... శుక్రవారం నాడు హై టిక్కెట్ ప్రైస్ తో రూ. 21.5 కోట్లు వసులు చేసిన 'సయారా' సోమవారం నాడు తక్కువ టిక్కెట్ రేట్లతోనూ రూ. 24 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ జానర్ లో 'సయారా' ఓ సరికొత్త లాండ్ మార్క్ ను క్రియేట్ చేసినట్టు అయ్యింది. అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పద్దా (Aneet padda) జంటగా నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ మంచి ప్లస్ అయ్యింది. దాంతో తప్పనిసరిగా రిపీట్ ఆడియెన్స్ కూడా వచ్చే ఆస్కారం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'సయారా' ఘన విజయంతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకుంటోంది. ఇక ఆగస్ట్ 14న వచ్చే 'వార్ -2'కు 'సయారా' సక్సెస్ ఓ శుభ సూచకంగా ట్రేడ్ పండిట్స్ భావిస్తున్నారు.
Also Read: Anasuya: కొల్లగొట్టినాదిరో.. మోత మోగిపోవాల్సిందే...
Also Read: Rashmi Gautam: ఏదీ శాశ్వతం కాదు.. మళ్లీ కలుద్దాం.. రష్మీకి ఏమైంది...