Anasuya: కొల్లగొట్టినాదిరో.. మోత మోగిపోవాల్సిందే..

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:09 PM

అనసూయ భరద్వాజ్‌ చెప్పింది వందకు వంద శాతం నిజమే. లిరికల్‌ వీడియోగా కొల్లగొట్టినదిరో పాటను చూసినప్పుడు అంతగా జనాలకు ఎక్కలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ పాటకు మంచి క్రేజ్‌ వచ్చింది.

Anasuya

‘అదృష్టవశాత్తు పవన్‌కల్యాణ్‌తో గారితో (Pawan Kalyan) నేనొక బ్యూటిఫుల్‌ సాంగ్‌ చేశాను. టెలివిజన్‌, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ షోస్‌లో ఆ పాట మోతమోగిపోయేంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది’ అని హరిహర వీరమల్లు (harihara veeramallu) చిత్రంలో ఆమె చేసిన ‘కొల్లగొట్టినాదిరో’ (Kollagottinadhiro song) పాట గురించి ఈటీవీ షోలో చెప్పారు యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌(Anasuya Bharadwaj). ఆమె చెప్పింది వందకు వంద శాతం నిజమే. లిరికల్‌ వీడియోగా ఆ పాటను చూసినప్పుడు అంతగా జనాలకు ఎక్కలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ పాటకు మంచి క్రేజ్‌ వచ్చింది.

పవన్‌కల్యాణ్‌కు కూడా మంచి డాన్స్‌ నంబర్‌ అని చెప్పొచ్చు. పవన్‌ క్రేజ్‌కు అనసూయ, పూజితా పొన్నాడ గ్లామర్‌ యాడ్‌ కావడంతో పాటకు మరింత గ్లామర్‌ వచ్చింది. సాంగ్‌ లిరిక్స్‌తోపాటు కొరియోగ్రఫీ కూడా బాగా కుదిరింది. థియేటర్‌లో ఆ పాటకు ప్రేక్షకాదరణ బావుంది. దీన్ని బట్టి చూస్తే అనసూయ చెప్పిన మాట  నిజమే అనిపిస్తుంది. ఈ పాట టీవీల్లో, ఎంటర్‌టైన్‌మెంట్‌ షోల్లో మారుమోగిపోవడం ఖాయం అనిపిస్తుంది.

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రమిది. 70 శాతం చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించగా, మిగతా పార్టును చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్‌ చేశారు. నిధీ అగర్వాల్‌ పంచమి పాత్రలో మెరిసింది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా.

Updated Date - Jul 24 , 2025 | 01:04 PM