Hansika: అడగకుండానే ఈ ఏడాది ఎన్నో పాఠాలు.. గుణపాఠాలు..
ABN, Publish Date - Aug 11 , 2025 | 02:49 PM
కొద్ది రోజులుగా హన్సిక వార్తల్లోనిలుస్తోంది. ఆమె తన భర్తతో విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నారు.
కొద్ది రోజులుగా హన్సిక (Hansika) వార్తల్లోనిలుస్తోంది. ఆమె తన భర్తతో విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన నోట్ వైరల్‌గా మారింది. ఆగస్ట్ 9న పుట్టినరోజు వేడుక నిర్వహించుకున్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది గురించి మాట్లాడుతూ ‘ఈ ఏడాది నేను అడగకుండానే నాకు చాలా పాఠాలు నేర్పింది. నాలో నాకే తెలియనంత బలం ఉందని తెలిపింది. పుట్టినరోజున అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే మనసు ఆనందంతో ఉప్పోంగిపోతుంది. మనసంతా ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి చిన్న విషయం కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది’ అని నోట్‌లో పేర్కొన్నారు. మరో పక్క ఆమెపై వస్తున్న రూమర్లు చర్చనీయాంశంగా మారింది.
2022 డిసెంబర్‌లో హన్సిక సోహైల్‌ను వివాహం చేసుకున్నారు. అతనికిది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఇంతకు ముందే పెళ్లై విడాకులు తీసుకున్నారు సోహైల్ (Sohail). ఈ వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. అయితే హన్సిక, సోహైల్ ఒకరిఒకరు దూరంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను సోహైల్ ఖండించారు. కానీ హన్సిక మాత్రం నోరు మెదపలేదు. పైగా సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడంతో ఆమెపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.
ALSO READ: War2 Event: నాగవంశీ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో రచ్చ
Cinema Bandh: కందుల దుర్గేష్ తో నిర్మాతల సమావేశం
Kamal Haasan: కమల్ హాసన్‌పై.. సీరియల్ ఆర్టిస్ట్ హత్యా బెదిరింపులు!
Kothapallilo Okappudu: ఆ ఓటీటీకి.. నాటు సరసం సినిమా! ఎప్పటినుంచంటే