Euphoria: గుణశేఖర్ 'యుఫోరియా' విడుదల వాయిదా
ABN, Publish Date - Dec 01 , 2025 | 12:05 PM
గుణశేఖర్ రూపొందించిన తాజా చిత్రం 'యుఫోరియా' మరోసారి వాయిదా పడింది. డిసెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు.
వినూత్న కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న గుణశేఖర్ (Gunasekhar) ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను తగ్గట్టుగా ‘యుఫోరియా’ (Euphoria) అంటూ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించారు. విఘ్నేష్ గవిరెడ్డి ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుండగా.. ప్రముఖ నటి భూమిక చావ్లా (Bhoomika Chawla), నట దర్శకుడు గౌతమ్ మీనన్ (Goutham Menon) కీలక పాత్రలను పోషిస్తున్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
'యుఫోరియా' సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలిమ గుణ గతంలో తెలిపారు. అయితే... ఇప్పుడీ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా మూవీ టీజర్ ను విడుదల చేస్తూ, ఫిబ్రవరి 6న దీనిని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుణ శేఖర్ తెరకెక్కించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన గ్లింప్స్, సాంగ్స్ సినిమా మీద అంచనాలను పెంచాయి. రాగిణి గుణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ కాలభైరవ (Kala Bhairava) ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి 'శాకుంతలం' తర్వాత గుణశేఖర్ తన పంథాను మార్చి తెరకెక్కించిన 'యుఫోరియా' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: Tuesday TV Movies: మంగళవారం, Dec 2.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Also Read: Bollywood: సంక్రాంతికి వస్తున్నాం.. అంటున్న అక్షయ్ కుమార్