Bollywood: సంక్రాంతికి వస్తున్నాం.. అంటున్న అక్ష‌య్ కుమార్‌

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:23 AM

సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ కు కన్ఫర్మ్ అయిపోయింది. అక్షయ్ కుమార్ హీరోగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు దిల్ రాజు తెలిపారు. అలానే సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలోనూ ఆయన మరో హిందీ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

Sankranthiki Vasthunnam

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) మరోసారి హిందీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. వెంకటేశ్‌, (Venkatesh) ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) ప్రధాన పాత్రలు పోషించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ ను తెలుగులో వసూలు చేసింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన దిల్ రాజుకు ఎప్పటి నుండో ఉంది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు ఆయన అధికారికంగా ప్రకటించారు. అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఆయన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీని నిర్మించబోతున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. 'సంక్రాంతి వస్తున్నాం'లోని కోర్ పాయింట్ ను బేస్ చేసుకుని, ఉత్తరాది ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా అనీస్ బాజ్మీ దీనిని ఈ స్ట్రక్చర్ చేస్తున్నారని దిల్ రాజు చెప్పారు. అక్షయ్ కుమార్, అనీస్ బాజ్మీ ది సూపర్ హిట్ కాంబినేషన్. వారిద్దరి కాంబోతో 'వెల్ కమ్, సింగ్ ఈజ్ కింగ్, ధ్యాంక్యూ' సినిమాలు వచ్చాయి. ఇదిలా ఉంటే... ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమాను దిల్ రాజు ప్లాన్ చేశారు. అది కూడా వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది.


ఇదిలా ఉంటే... దిల్ రాజు సోదరుడు, ప్రముఖ నిర్మాత శిరీష్ వచ్చే యేడాది తమ సంస్థ నుండి ఆరు సినిమాలు ఖచ్చితంగా విడుదల అవుతాయని అన్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా 'రౌడీ జనార్దన్' మూవీని ఈ సంస్థ నిర్మిస్తోంది. అలానే ఆశిష్ రెడ్డితోనూ ఓ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. మరి రెండు మూడు ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ తోనూ సినిమా చేయబోతున్నట్టుగా శిరీష్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ యేడాది మిశ్రమ స్పందనను అందుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ వచ్చే యేడాది మరోసారి తన సత్తాను చాటే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది.

Also Read: Ashika Ranganath Achala: ఆషికా కుటుంబంలో విషాదం.. క‌జిన్ ఆత్మ‌హ‌త్య‌

Also Read: Samantha and Raj Nidimoru: నేడు.. స‌మంత, రాజ్ పెళ్లి? నిజ‌మేనా.. న్యూస్ వైర‌ల్‌

Updated Date - Dec 01 , 2025 | 01:03 PM