సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhanda 2: గీతామాధురీ.. యాక్ట్ చేసిందిరోయ్

ABN, Publish Date - Dec 02 , 2025 | 12:00 PM

అఖండ 2 తాండవం చిత్రంలో గీతామాధురి కేమియో రోల్ ప్లే చేసిందని తెలుస్తోంది. అఖండ 2 డిసెంబర్ 5న రాబోతుండగా, గీతా మాధురి భర్త నందు హీరోగా నటించి, నిర్మించిన 'సైక్ సిద్ధార్థ్‌' మూవీ డిసెంబర్ 12న రిలీజ్ అవుతోంది.

Actor Nandu - Singer Geetha Madhuri

తెలుగు సినిమా రంగంలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని క్రేజీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఈ నెల 5న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ద్విపాత్రాభినయం చేసిన 'అఖండ -2 తాండవం' (Akhanda 2 Thandavam) మూవీ రాబోతోంది. బాలకృష్ణ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. విశేషం ఏమంటే... ఇందులో సింగర్ గీతా మాధురి కూడా తెర మీద తళుక్కున మెరిసినట్టు సమాచారం. బాలకృష్ణ, సంయుక్త (Samyuktha) పై చిత్రీకరించిన 'జాజికాయ...జాజి కాయ' సాంగ్ లో గీతామాధురి (Geethamadhuri) కూడా కనిపిస్తుందని అంటున్నారు. గతంలోనూ గీత రచయితలు, డాన్స్ మాస్టర్స్ ఇలా తాము రాసిన పాటల్లోనూ, కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ లోనూ మెరుపులా కొన్ని క్షణాలు తెర మీద కనిపించడం మామూలే.

అయితే సింగర్స్ మేకింగ్ వీడియోల్లో మాత్రమే కనిపించే వారు. కానీ 'అఖండ' (Akhanda)లో 'జై బాలయ్య' (Jai Balayya) పాట పాడిన గీతా మాధురి 'అఖండ -2'లో ఓ పాటలో స్పెషల్ అప్పీయిరెన్స్ ఇవ్వడం విశేషమే అంటున్నారు. మరి ఆమె ఇక మీద కూడా ఇలా తెర మీద కేమియో రోల్స్ లేదా ప్రధాన పాత్రల్లో కనిపిస్తుందేమో చూడాలి. ఎందుకంటే కెమెరాకు గీతామాధురి కొత్తేమీ కాదు... 'పాడుతా తీయగా' నుండి ఎంతోమంది శ్రోతల మనసుల్ని దోచుకున్న గీతా మాధురి ఆ తర్వాత మ్యూజిక్ బేస్డ్ రియాల్టీ షోస్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది.


ఇదిలా ఉంటే... గీతా మాధురి భర్త, నటుడు నందు (Nandu) ఇప్పుడు తన పేరు ముందు శ్రీ అనే అక్షరాన్ని చేర్చుకున్నాడు. అతను హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ్‌' మూవీ ఇదే నెల 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు అతను ఎడిషనల్ స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నాడు. యామినీ భాస్కర్ హీరోయిన్. వరుణ్‌ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్‌ బాబు గ్రాండ్ గా ఈ నెల 12న విడుదల చేయబోతున్నాడు. అంటే భార్య కేమియో చేసిన సినిమా విడుదలైన వారానికి ఆమె భర్త హీరోగా నటించి, నిర్మించిన సినిమా రాబోతోందన్న మాట. నందు కూడా కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా పలు రియాల్టీ షోస్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లకు కామెంటేటర్ గానూ వ్యవహరిస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో శ్రీ నందు, గీతామాధురి కలిసి తెర మీద జంటగా కనిపిస్తారేమో చూడాలి.

Also Read: Samantha: బాధితురాలిగా.. బాగా నటించింది! సమంత పర్సనల్‌ స్టైలిస్ట్‌.. అంత మాట అనేసిందేంటి

Also Read: Samantha - Raj Nidimoru: స‌మంత పెళ్లి.. ఇంత క‌థ ఉందా

Updated Date - Dec 02 , 2025 | 03:50 PM