Samantha: బాధితురాలిగా.. బాగా నటించింది! సమంత పర్సనల్ స్టైలిస్ట్.. అంత మాట అనేసిందేంటి
ABN , Publish Date - Dec 02 , 2025 | 10:51 AM
కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నారంటూ టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత (Samantha), దర్శకుడు రాజ్ నిడియోరుపై (Raj Nidimoru) ఎన్నో వైరల్ వార్తలొచ్చాయి.
కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నారంటూ టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత(Samantha), దర్శకుడు రాజ్ నిడియోరుపై (Raj Nidimoru) ఎన్నో వైరల్ వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ వీరిద్దరూ సోమవారం ఈశా ఫౌండేషన్‌లో లింగ భైరవి ఆలయం వద్ద అత్యంత సన్నిహితుల భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. నూతన వధూవరులకు విషెష్ చెబుతూ ఈశా ఫౌండేషన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు సమంతకు శుభాకాంక్షలు చెబుతుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.
అయితే సమంత వివాహం తర్వాత తన పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ (Sadhna singh) సమంతను ఇన్‌స్ట్రాగామ్‌లో అన్‌ఫాలో చేసింది. అంతే కాకుండా ‘బాధితురాలిగా.. విలన్ చాలా బాగా నటించింది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఆమె సామ్‌ను విలన్ అనేసిందా? అంటూ ఫ్యాన్స్‌తోపాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతే కాదు 'నిన్నటి నుంచి నా ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే' అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది మరోవైపు నాగచైతన్య గత వీడియో వైరల్ అవుతుండగా ఆయనకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు నటి పూనమ్ కౌర్ కూడా సమంతను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఇది ఇన్‌డైరెక్ట్‌గా సమంతను ఉద్దేశించే అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ అహంకార పూరిత మహిళను పెయిడ్ పీఆర్ గొప్పగా చూపిస్తున్నారు. బలహీనమైన, నిరాశ చెందిన పురుషులను డబ్బుతో కొనవచ్చు.’ అంటూ రాయగా... పూనమ్ అంత మాట అనేసిందేంటి అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.