Gautam ghattamaneni: గౌతమ్‌ ఘట్టమనేని..  కార్‌ వీడియో వైరల్‌..

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:13 PM

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు గారాల తనయుడు గౌతమ్‌ ఘట్టమనేనికి మహేశ్‌ ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా మహేశ్‌ ఫ్యాన్‌ ఒకరు గౌతమ్‌ వీడియోను షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు.

Gautam Ghattamaneni

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు(Mahesh Babu) గారాల తనయుడు గౌతమ్‌ ఘట్టమనేనికి (Gautam ghattamaneni) మహేశ్‌ ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. సోషల్‌ మీడియాలోనూ మంచి క్రేజ్‌ ఉన్నప్పటికీ చాలా హంబుల్‌గా, సైలెంట్‌గా ఉంటారు గౌతమ్‌. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి ఎఎంబీ మాల్‌లో సందడి చేస్తుంటాడు. తాజాగా మహేశ్‌ ఫ్యాన్‌ ఒకరు గౌతమ్‌ వీడియోను షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. తాజాగా గౌతమ్‌ ఘట్టమనేని కారు డ్రైవింగ్‌ చేస్తూ వెళ్లున్న వీడియోను షేర్‌ చేశాడు. అభిమాని బైక్‌ మీద వెళ్తూ తన ఫోన్‌లో గౌతమ్‌ డ్రైవ్‌ చేస్తున్న వీడియో క్యాప్చర్స్‌ చేశాడు. అది గమనించిన గౌతమ్‌ 'ఏయ్‌ ముందుకు చూడు అని సైగ చేశాడు’ అని సదరు అభిమాని వీడియో పోస్ట్‌ చేశాడు. (Gautam Car video viral)


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా కాగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  ఈ వీడియో చూసి గౌతమ్‌ వయసు గురించి చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడే కారు ఇచ్చారేంటి? గౌతమ్‌కి 18 నిండాయా? డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? అని కామెంట్లు పెడుతున్నారు. 18 ఏళ్లు నిండాయి కాబట్టే కార్‌ ఇచ్చారు మహేశ్‌ లేదంటే.. గారంగా పెంచుకునే అతన్ని రూల్స్‌ లేకుండా వదలరు కదా అని అభిమానులు కౌంటర్స్‌ ఇస్తున్నారు.


గౌతమ్‌ ఘట్టమనేని న్యూయార్క్‌లో యాక్టింగ్‌ కోర్సులో ట్రైనింగ్‌ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. యాక్టింగ్‌ స్కూల్లో గౌతమ్‌ నటించిన వీడియోలను నమ్రత ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. పాక్‌ అమ్మాయితో గౌతమ్‌ చేసిన ఓ చిన్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అయితే గౌతమ్‌ ఇటీవల ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది.


ALSO READ:

Bollywood: వెండితెరపైకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్

Special Ops 2 Trailer: హిమ్మ‌త్ సింగ్ వ‌చ్చేస్తున్నాడు.. గెట్ రెడీ

Updated Date - Jun 17 , 2025 | 02:57 PM