Special Ops 2 Trailer: హిమ్మ‌త్ సింగ్ వ‌చ్చేస్తున్నాడు.. గెట్ రెడీ

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:21 PM

ఐదేండ్ల క్రితం అనామ‌కంగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి విశేష ప్రేక్ష‌క‌కాద‌ర‌ణ పొంది మంచి విజ‌యం సాధించిన హిందీ వెబ్ సిరీస్ స్పెష‌ల్ ఓపీఎస్.

ops2

అప్పుడ‌ప్పుడే మ‌న దేశంలో ఓటీటీలు పుంజుకుంటున్న స‌మ‌యంలో ఐదేండ్ల క్రితం అనామ‌కంగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి విశేష ప్రేక్ష‌క‌కాద‌ర‌ణ పొంది మంచి విజ‌యం సాధించిన హిందీ వెబ్ సిరీస్ స్పెష‌ల్ ఓపీఎస్ (Special Ops). ప్ర‌ముఖ న‌టులు కేకే మీన‌న్ (Kay Kay Menon), విన‌య్ పాఠ‌క్‌, క‌ర‌ణ్ టాక‌ర్‌, స‌యామి ఖేర్ వంటి న‌టీన‌టులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. గ‌తంలో ఎ వెగ్న‌స్ డే, ధోని, బేబీ, స్పెష‌ల్ 26 వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన నీర‌జ్ పాండే (Neeraj Pandey) రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం విశేషం.

కాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కించిన స్పెష‌ల్ ఓపీఎస్ (Special Ops) సీజ‌న్ 2 రిలీజ్‌కు సిద్ధ‌మైంది. జూలై 11న జియో హాట్ స్టార్‌ ( Jio Hotstar)లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈనేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ సెకండ్ సీజ‌న్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌ను చూస్తే మొద‌టి భాగాన్ని మించి ఈ సీజ‌న్‌ను రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు ప్ర‌కాశ్ రాజ్ వంటి సీనియ‌ర్ న‌టుడు ఈ ద‌ఫా సీజ‌న్‌లో కీల‌క పాత్ర‌లో న‌టించాడు. పూర్తిగా సైబ‌ర్‌, టెర్ర‌రిజంపై హిమ్మ‌త్ సింగ్ అత‌ని టీమ్ పోరాటం, ఎత్తులు, పై ఎత్తుల‌ నేప‌థ్యంలో అదిరిపోయే యాక్ష‌న్ సీన్ల‌తో ఈ సిరీస్ సాగ‌నుంది.

Updated Date - Jun 17 , 2025 | 02:27 PM