Tollywood Producer: పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే చంపేస్తా.. నిర్మాత బెదిరింపులు
ABN, Publish Date - Sep 11 , 2025 | 12:06 PM
కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే చంపాస్తానని సినీ నిర్మాత.. వృద్ధురాలిని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సినీ నిర్మాత దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే చంపాస్తానని సినీ నిర్మాత.. వృద్ధురాలిని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సినీ నిర్మాత దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్(Jublihills) నంబరు 10లో సీహెచ్ లక్ష్మేశ్వరి అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 25లో కుమారుడికి చెందిన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఓ ప్రకటన ఇచ్చింది. దానికి 2013 ఎస్‌బీకే ఫిలిం ప్రొడక్షన్స్ (SBK FILM productions) నిర్వాహకుడు, నిర్మాత షేక్ బషీద్ అతడి భార్య ఎస్‌కే కరీమున్నీసా సంప్రదించి 11 నెలల పాటు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో చేసుకున్న అగ్రిమెంట్ పూర్తవ్వడంతో ఇల్లు ఖాళీ చేయాలని కోరింది. అప్పటి నుంచి అద్దె చెల్లించకపోగా ఖాళీ చేయడం లేదు. దీంతో కోర్టును ఆశ్రయిస్తే అక్టోబరు 2023లో ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. కాని బషీద్ కోర్టులో తనకు 99 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ ఉందని కోర్టుకెక్కాడు. ఆమె కుమారుడు కూడా కోర్టులో మరో పిటిషన్ వేశాడు. విచారణలో ఫోర్జరీ సంతకాలతో కూడిన అగ్రిమెంట్‌ను బషీద్ చూపించాడని నిర్ధారణైంది. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 23 కేసులు, పంజాగుట్ట పోలీసు స్టేషన్(Panjagutta Police Station)లో రౌడీషీట్ ఉన్నట్టు స్పష్టమైంది. ఇదే విషయాన్ని వృద్ధురాలి కుమారుడు కోర్టుకు నివేదించాడు. దీంతో ఈనెల 9న బషీర్ అతడి అనుచరులతో వృద్ధురాలి ఇంటికి వెళ్లి కోర్టులో పిటిషన్‌లు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: Folk Song: జాజిరిలాటలాడంగా.. మరో మంచి పల్లె పాట వచ్చింది
Kishkindhapuri: కిష్కిందపురి.. ప్రీమియర్ టాక్ రివ్యూ! బెల్లంకొండ హిట్ కొట్టాడా
Malavika Mohanan: ఇలాంటి అవకాశం ఎవరికైనా లభిస్తుందా