Folk Song: జాజిరిలాటలాడంగా.. మరో మంచి పల్లె పాట వచ్చింది
ABN , Publish Date - Sep 10 , 2025 | 09:21 PM
తెలుగు జానపాద పాటలు ఇష్టపడే శ్రోతలను అలరించేందుకు మరో ఫోక్ సాంగ్ తాజాగా విడుదలైంది.
తెలుగు జానపాద పాటలు ఇష్టపడే శ్రోతలను అలరించేందుకు మరో ఫోక్ సాంగ్ తాజాగా బుధవారం విడుదలైంది. జాజిరి ఆటలాడంగా జామ చెట్టు కింద జారిపడ్డవోయ్ బావయ్యా కల్జారి పడ్డవోయ్ బావయ్య అంటూ (Jajirataladanga Full Song) బావను టీజ్ చేస్తూ మరదలు పాడే హుషారైన గేయంగా ఈ పాట రాగ యుక్తంగా, సాహిత్య నరంగా, విజువల్స్ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.
ప్రముఖ జానపద పాటల స్పెషలిస్టు మామిడి స్వయంగా ఈ పాటకు సాహిత్యం అందించడమే కాక ఆలపించడం విశేషం. వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera) ఈ గీతానికి సంగీతం అందించగా ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ప్లూయన్సర్ భ్రమరాంబిక తుటిక (Bramarambika Tutika) నటించింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి వ్యూస్ దక్కించుకుంటూ పల్లె పాటల మాధుర్యాన్ని మరోసారి రుచి చూపిస్తోంది.