Malavika Mohanan: ఇలాంటి అవకాశం ఎవరికైనా లభిస్తుందా

ABN , Publish Date - Sep 11 , 2025 | 10:04 AM

మాళవిక మోహనన్ మలయాళ స్టార్ మమ్ముట్టిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ కి ఆయనేం చేశారో చెప్పుకొచ్చారు 

Malavika Mohanan


మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్మూట్టి వంటి అగ్ర నటుడు ఆడిషన్‌ చేసే భాగ్యం ఎవరికైనా దక్కుతుందా అని ప్రముఖ హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ అన్నారు.

Malavika-mohanan.jpg

‘పేట’ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మాళవికా మోహనన్‌... ఆ తర్వాత ‘మాస్టర్‌’, ‘తంగలాన్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. అయితే, ఆమె తొలిసారి దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ‘పట్టంపోలే’ అనే చిత్రలో నటించారు. ప్రముఖ కెమెరామెన్‌ కె.యు.మోహనన్‌ కుమార్తె అయినప్పటికీ ఆమెకు కూడా ఆడిషన్‌ తప్పలేదు. ఈ ఆడిషన్‌కు ఆమెకు సహకరించిన నటుడు మమ్మూట్టి. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పైగా ఆడిషన్‌ సమయంలో మమ్మూట్టి తీసిన ఫొటోను ఆమె షేర్‌ చేసి, ‘ఎవరికైనా ఇలాంటి అవకాశం లభిస్తుందా? కానీ, నాకు లభించింది. ‘పట్టంపోలే’ సినిమా కోసం కథానాయిక కోసం వెతుకుటుండగా నన్ను ఓ షూటింగ్‌ లొకేషన్‌లో మమ్మూట్టి చూసి, అక్కడే ఆడిషన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోలు తీశారు. ఆయనే నాకు తొలి చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. అలా సినీ ఇండస్ట్రీలోకి నేను అడుగుపెట్టాను’ అని ఆమె పాత ఙ్ఞాపకాలను వివరించారు. 

Malavika.jpg

మాళవిక ప్రస్తుతం తెలుగులోనూ నటిస్తోంది. ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది. 

READ ALSO: Tollywood Producer: పిటిషన్‌ వెనక్కి తీసుకోకుంటే చంపేస్తా.. నిర్మాత బెదిరింపులు

Folk Song: జాజిరిలాట‌లాడంగా.. మ‌రో మంచి ప‌ల్లె పాట వ‌చ్చింది

Kishkindhapuri: కిష్కింద‌పురి.. ప్రీమియ‌ర్ టాక్ రివ్యూ! బెల్లంకొండ హిట్ కొట్టాడా

Updated Date - Sep 11 , 2025 | 12:47 PM