OG: ఇలా.. చేశారేంటి! ఓజీ గ్లిమ్స్‌పై.. అభిమానుల నిరుత్సాహం
ABN, Publish Date - Sep 02 , 2025 | 05:25 PM
పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ (OG Movie). ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, కథానాయికగా ప్రియాంకా మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, ఫైర్‌స్ట్రామ్ గ్లింప్స్, సువ్వి సువ్వి సాంగ్ సినిమాపై అంచనాలను ఆకాశమే హద్దు అన్నట్టుగా పెంచేశాయి. ఇక పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం విడుదల చేసిన “HBD OG – LOVE OMI” కొత్త గ్లింప్స్ అభిమానులకు డబుల్ గిఫ్ట్ అందించినట్లైంది. ఈ వీడియోలో ప్రతినాయకుడు ఇమ్రాన్ హాస్మీ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఆయన పాత్ర ద్వారా విలన్ ఓజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించడం విభిన్నంగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
‘డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని.. ఎదురుచూస్తున్నా.. నీ ఓమీ.. హ్యాపీ బర్త్‌డే ఓజీ’ అంటూ గంభీరంగా చెప్పే డైలాగులు అదిరిపోయాయి. పవన్‌తో పాటు ఇమ్రాన్ లుక్స్ కూడా మైస్మరైజింగ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ ను అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు. ఇదిలాఉంటే.. ఈ గ్లిమ్స్ పై పలువురు పెదవి విరుస్తున్నారు.
పవన్ పుట్టిన రోజు నాడు ఓజీ సినిమా నుంచి పవన్ కు సంబంధించిన యాక్షన్ సీన్లు గానీ, ఏవైనా పంచ్ డైలాగులు కానీ ఇంకా ట్రెండింగ్ ఫీడ్ ఇస్తారనుకుంటే అసలు పవన్ జన్మదినం రోజు ఆయనకే ప్రయారిటీ ఇవ్వకుండా గ్లిమ్స్ రిలీజ్ చేయడంపై మండి పడుతున్నారు. విమర్శలు గుప్తిస్తున్నారు. అసలు బర్త్ డే పవన్ దా లేక ఇమ్రాన్ హస్మీ దా అనే కామెంట్లు సైతం వస్తున్నాయి.